News January 3, 2026
6న పార్వతీపురంలో జాబ్ మేళా.. 561 ఖాళీలకు ఇంటర్వ్యూలు

పార్వతీపురం ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈనెల 6న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి R.వహీదా శుక్రవారం తెలిపారు. మొత్తం 9 కంపెనీల్లో 561 ఖాళీలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 18 ఏళ్లు కలిగి పది, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన స్త్రీ, పురుషులు అర్హులన్నారు. ఆసక్తిగల, అర్హతలున్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News January 3, 2026
వరంగల్: జాగ్రత్త గురూ.. మాంజాతో గొంతులు తెగుతున్నాయ్!

సంక్రాంతి వస్తే చాలు.. ఆకాశంలో గాలి పటాల సందడి మామూలుగా ఉండదు. వయసుతో సంబంధం లేకుండా పోటీ పడి మరీ పతంగ్ ఎగరేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిషేధిత చైనా మాంజా వాడటం ప్రమాదాలకు దారితీస్తోంది. దీనికితోడు కొందరు గాలిపటం ఎగరేసి దారం వదిలేస్తుంటారు. ఆ మాంజా చెట్లు, కరెంట్ తీగలకు చుట్టుకుంటోంది. ప్రమాదకరంగా కిందకు వేలాడుతూ ప్రయాణికుల గొంతులు కోస్తోంది. <<15024024>>మన WGLలో గతంలో ఎందరో గాయపడ్డారు.<<>>
⊘ BAN CHINA MANJA
News January 3, 2026
దద్దరిల్లనున్న హైదరాబాద్

సంక్రాంతి వస్తే సిటీలో పతంగ్ ఎగరాల్సిందే. గల్లీలో పెద్ద బిల్డింగ్ ఒక్కటి ఉంటే చాలు. చరాక్‌కు షాదీ, మాంజా చుట్టి బిల్డింగ్ ఎక్కాల్సిందే. ఆకాశంలో పోటీ పడుతోన్న గాలిపటాలు చూసిన ఆ క్షణం వైబ్ వేరు. పేంచ్‌లు వేస్తూ గాలిపటాలతో యుద్ధం చేస్తుంటారు. దోస్తులంతా కలిసి చేసుకునే దావత్ మామూలుగా ఉండదు. మందు, మాంసంతో బలగం చేసే సందడి జాతరను తలపిస్తుంది. ‘కాటే పతంగ్’ నినాదాలతో హైదరాబాద్ హోరెత్తనుంది.
News January 3, 2026
విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఫ్రీ జర్నీ.. ఎంపీలు, మంత్రి భారీ ప్లాన్.!

విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత విముక్తి కల్పించేలా 3 భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. MPలు చిన్ని, బాలశౌరి, మంత్రి కొల్లు, MLAలు శుక్రవారం NHAI అధికారులతో భేటీ అయ్యారు. రాజీవ్ గాంధీ పార్క్-బెంజ్ సర్కిల్(5KM), బెంజ్ సర్కిల్-గోశాల(10KM), మహానాడు జంక్షన్-నిడమానూరు(5.5KM) వరకు 6 వరుసల ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరారు.


