News October 4, 2025

6వ తేదీన స్వచ్ఛ అవార్డుల ప్రధానం: VZM కలెక్టర్

image

స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాకు 2 రాష్ట్ర స్థాయి అవార్డులు, 48 జిల్లాస్థాయి అవార్డులు వచ్చాయని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలను ఈనెల 6న అవార్డులు తీసుకోవడానికి విజయవాడ పంపిస్తున్నామని, జిల్లా స్థాయి అవార్డు గ్రహీతలకు జిల్లాల ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అవార్డులను పంపిణీ చేస్తామన్నారు.

Similar News

News October 4, 2025

విజయనగరం ఉత్సవాలు, పైడితల్లమ్మ పండగపై సమీక్ష

image

విజయనగరం ఉత్సవాలు, పైడితల్లమ్మ పండగపై కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ, అమ్మవారి సిరిమానోత్సవం గురించి అధికారులతో చర్చించారు. భక్తులు ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడాలని, ట్రాఫిక్ మళ్లింపు పై దృష్టి పెట్టాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు.

News October 4, 2025

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిరసన

image

గ్రామ, వార్డు సచివాలయాల హెల్త్ సెక్రటరీలకు ఎంపీహెచ్‌ఎ (ఎఫ్) లుగా పదోన్నతి కల్పించాలని శుక్రవారం అర్ధరాత్రి జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిద్రచేసి నిరసన తెలిపారు. ఆరు నెలలుగా పదోన్నతులకు సంబంధించిన జీవో జారీ చేసి ఇంతవరకు ప్రమోషన్ లిస్టు ప్రకటించలేదన్నారు. ప్రమోషన్ లిస్టును ప్రకటించేంతవరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని నిరసన తెలుపుతామని సచివాలయాల హెల్త్ సెక్రటరీలు ప్రకటించారు.

News October 4, 2025

VZM: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విజయనగరంలోని కాటవీధిలో కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు. ఎల్.వెంకటేశ్వరరావు (41) కాట వీధిలో వెల్డింగ్ షాపును నిర్వహిస్తున్నాడు. దసరా రోజు షాపులో పూజలు చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి సాయంత్రం షాపును తెరుస్తుండగా విద్యుత్ కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. 108లో జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.