News March 29, 2024
6 చోట్ల మహిళ MLAలే లేరు..!.. రాజ్యలక్ష్మి రికార్డ్ కొట్టేనా..?
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాలకు గానూ 6 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు మహిళా MLAలుగా గెలిచిన వారే లేరు. అవే.. నిడదవోలు, పోలవరం, ఉంగుటూరు, తణుకు, ఏలూరు, భీమవరం. మిగతా 9 చోట్ల వేర్వేరు ఎన్నికల్లో అతివలు సత్తా చాటి పరిపాలన చేశారు. అయితే.. ఈసారి పోలవరం వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మికి దక్కింది. ఆమె ఈ పోరులో గెలిచి పోలవరం చరిత్రలో నిలిచేనా చూడాలి.
Similar News
News January 16, 2025
తాడేపల్లిగూడెం: అసలు ఎవరీ రత్తయ్య..?
సంక్రాంతి నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో వేలల్లో పందేలు జరిగాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈసారి తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ.1.25 కోట్ల పందెం జరిగింది. కోడిపందేల్లో పేరు మోసిన రత్తయ్య పుంజు, గుడివాడ ప్రభాకర్ పుంజు మధ్య రసవత్తరంగా పందెం జరిగింది. ఎంతో పేరు మోసిన రత్తయ్య పుంజు ఓడిపోవడంతో అందరూ ఖంగుతిన్నారు. అసలు ఎవరీ రత్తయ్య అని ఆరా తీయగా.. ఆయనది లింగపాలెం మండలం రంగాపురం అని తేలింది.
News January 16, 2025
ప.గో: పందెంలో మీకు ఏం వచ్చింది?
గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో మూడు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కొందరు లాభ పడగా.. మరికొందరు ఎంతో నష్టపోయారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కార్లను సైతం కుదవ పెట్టేశారట. కొందరు నెల జీతం మొత్తాన్ని క్షణాల్లో పోగొట్టేసుకున్నారు. మరికొందరు స్థలాలను సైతం తాకట్టు పెట్టేశారు. మీ పరిధిలో ఎవరైనా ఇలా నష్టపోయారా? లాభపడ్డారా? తెలిస్తే కామెంట్ చేయండి.
News January 16, 2025
మొగల్తూరులో కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు
మొగల్తూరులో బుధవారం సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. మొగల్తూరుకి చెందిన విష్ణు ప్రియ, గుంటూరుకు చెందిన త్రిపురమల్లు వైష్ణవ్‌లకు గత ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. తొలి పండుగకు అల్లుడితో పాటు కుటుంబ సభ్యులను విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఫణి, ఝాన్సీలు ఆహ్వానించారు. వైష్ణవ్‌కు 200 రకాల పిండివంటలతో విందు ఏర్పాటు చేసి మర్యాద చేశారు.