News September 13, 2025
6 లైన్ల రోడ్డు: బీచ్ రోడ్ To భోగాపురం.. వయా భీమిలి..!

భోగాపురం ఎయిర్‌పోర్టుతో సిటీకి కనెక్టెవిటీ పెంచేందుకు బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా 6 లైన్ల రోడ్డు నిర్మాణానికి కొత్త ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రోడ్డు స్థానిక రాజకీయ నాయకుల భూమి విలువలు పెరగడానికి అవకాశం కల్పించిందని విమర్శలొచ్చాయి. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలోనే రోడ్డు నిర్మించేందుకు చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాల సమాచారం.
Similar News
News September 13, 2025
KNR: ఘనంగా ‘బొడ్డెమ్మ సంబురం’ ఆరంభం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బొడ్డెమ్మ పండగ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. KNR(D) వీణవంక మం. నర్సింగాపూర్‌లోని హరిహర క్షేత్రం దేవస్థానంలో మహిళా భక్త మండలి ఆధ్వర్యంలో మహిళలు శుక్రవారం బొడ్డెమ్మ పండగ వేడుకలను అట్టాహాసంగా ప్రారంభించారు. కాగా, ఈ వేడుకలో గౌరీ దేవీని ఆరాధిస్తామని, బొడ్డెమ్మ పండగ మట్టి, పూలతో ముడిపడిన ఓ ప్రకృతి పండగని వనితలన్నారు. మనిషికి, మట్టికి, ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందన్నారు.
News September 13, 2025
కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ కలకలం

చేబ్రోలు (M) కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ లక్షణాలు ఒకరిలో బయటపడటంతో మండలంలో కలకలం రేపుతుంది. ఇప్పటికే జ్వరాలు ఉన్నవారికి రక్త పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి నెగిటివ్ వచ్చిందని మిగిలిన నలుగురికి కొకొయ్ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ కొత్తరెడ్డిపాలెంపై దృష్టి పెట్టింది.
News September 13, 2025
వెంకటాపూర్: 34 అడుగులకు చేరువలో రామప్ప నీటిమట్టం

వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రసిద్ధి చెందిన రామప్ప చెరువు నీటిమట్టం 33.6 అడుగులకు చేరింది. గత కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సరస్సులోకి వరద నీరు చేరుతుంది. సరస్వతి నీటిమట్టం 36 అడుగులు కాగా.. 35 అడుగులకు మత్తడి పడే అవకాశం ఉంది. దీంతో రెండు పంటలకు సరిపడా నీరు అందుతుందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.