News February 11, 2025

2029 కల్లా 63లక్షల ఎయిడ్స్ మరణాలు: ఐరాస

image

ఎయిడ్స్ నియంత్రణకు ఏటా US ఇచ్చే రూ.3,83,160కోట్ల సాయాన్ని ట్రంప్ నిలిపేయడంపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో కొత్త HIV కేసులు 6 రెట్లు పెరుగుతాయని చెప్పింది. 2029 కల్లా 63 లక్షల ఎయిడ్స్ మరణాలు సంభవిస్తాయంది. 2023లో కొత్తగా 13 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయని, ట్రంప్ నిర్ణయంతో ఇప్పటి వరకు 160 దేశాల్లో వచ్చిన ఫలితాలు వృథా అవుతాయంది. ఇథియోపియా, ఉగాండా, మొజాంబిక్ దేశాల్లో ఎయిడ్స్ కేసులు ఎక్కువ.

Similar News

News February 11, 2025

ఆ సీసీ కెమెరాలు అధికారులే తొలగించారు: YCP

image

AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద అగ్నిప్రమాద ఘటనపై CC ఫుటేజీ ఇవ్వాలన్న పోలీసుల <<15407091>>నోటీసులకు<<>> పార్టీ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోడ్డులోని సీసీ కెమెరాలను అధికారులే తొలగించారని తెలిపారు. బారికేడ్లను తీసేసి అన్ని వాహనాలకు అనుమతిచ్చారన్నారు. మాజీ సీఎం జగన్ భద్రతపై అనుమానాలున్నాయని, ఈ విషయాన్ని ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.

News February 11, 2025

రోహిత్ మరో 13 పరుగులు చేస్తే..

image

ENGపై రెండో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన IND కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డుపై కన్నేశారు. రేపు జరిగే మ్యాచ్‌లో 13 పరుగులు చేస్తే ODIలలో వేగంగా 11,000 రన్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తారు. హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 259 Innsలో 10,987 రన్స్ చేశారు. 222 ఇన్నింగ్సుల్లోనే 11వేల పరుగులు చేసిన కోహ్లీ టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత సచిన్(276Inns), పాంటింగ్(286Inns), గంగూలీ(288Inns), కల్లిస్(293Inns) ఉన్నారు.

News February 11, 2025

వాట్సాప్‌లో టీటీడీ, రైల్వే సేవలు: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటి వరకు 2.64 లక్షల లావాదేవీలు జరిగినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. త్వరలోనే టీటీడీ, రైల్వే సేవలను కూడా వాట్సాప్‌లో అందిస్తామన్నారు. అయితే 35 శాతం సర్వర్ సమస్యలు వస్తున్నాయని, ఆయా శాఖలు సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని సూచించారు. సమీక్షలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ వాట్సాప్‌లోనే క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తామని వెల్లడించారు.

error: Content is protected !!