News November 1, 2025

6.30 నుంచే పెన్షన్ల పంపిణీ: తిరుపతి కలెక్టర్

image

తిరుపతి జిల్లాలో శనివారం ఉదయం 6.30కే పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఉదయం 7గంటలకు 100 శాతం సిబ్బంది పింఛన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. పునః పరిశీలనలో అనర్హులుగా గుర్తించిన పింఛనుదారులు, అప్పీలు చేసుకోని వారికి కూడా ఈనెల పింఛన్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వారికీ సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేయాలన్నారు.

Similar News

News November 1, 2025

2 రోజుల్లో అల్పపీడనం.. AP, TGలో వర్షాలు

image

రానున్న 2 రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అటు TGలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముంది.

News November 1, 2025

నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ

image

TG: ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నారు. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 14 వరకు చెల్లించొచ్చు. ₹100 ఫైన్‌తో ఈ నెల 16-24, ₹500తో ఈ నెల 26 నుంచి DEC 1 వరకు, ₹2వేల జరిమానాతో DEC 10 నుంచి 15 వరకు స్వీకరిస్తారు. ENG ప్రాక్టికల్స్‌కు ₹100 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ స్టూడెంట్స్ కు ₹630, ఫస్టియర్ ఒకేషనల్‌కి ₹870, సెకండియర్ ఆర్ట్స్‌కు ₹630, సెకండియర్ సైన్స్, ఒకేషనల్‌కి ₹870 చెల్లించాలి.

News November 1, 2025

సంసార చక్రం నుంచి విముక్తి పొందాలంటే..

image

మన జీవుడికి 3 రకాల శరీరాలు ఉంటాయి. అవి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరంలోనే(భౌతిక దేహం) అన్ని కర్మలు చేస్తాం. సూక్ష్మశరీరం(మనస్సు, ఇంద్రియాలు) సుఖదుఃఖాలను అనుభవిస్తుంది. కారణశరీరం(అజ్ఞాన రూపం) ఆత్మానందాన్ని పొందుతుంది. మనం చేసే పుణ్యపాప కర్మల ఫలంగా సుఖదుఃఖాలు కలుగుతాయి. జీవుడిలా కర్మల బంధంలో, సంసార చక్రంలో తిరుగుతాడు. వీటి నుంచి విముక్తి పొందడానికి శివుడిని ప్రార్థించడమే మార్గం.<<-se>>#SIVOHAM<<>>