News November 25, 2024
UPI నగదు చెల్లింపుల్లో 6.32 లక్షల మోసాలు
UPI నగదు చెల్లింపుల్లో 2024-25 FYలో ₹485 Cr విలువైన 6.32 లక్షల మోసాలు జరిగినట్టు కేంద్రం తెలిపింది. గత FYలో ₹1,087 కోట్ల విలువైన 13.42 లక్షల మోసాలు జరిగినట్టు వెల్లడించింది. మోసాల కట్టడికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం తెలిపింది. యూపీఐ, ఇతర ఆన్లైన్ చెల్లింపుల్లో మీకు మోసాలు ఎదురైతే 1930కు ఫోన్ చేయండి, లేదా <
Similar News
News November 25, 2024
BHUVI: ఆరెంజ్ ఆర్మీ హార్ట్ బ్రేక్!
ఐపీఎల్ వేలంలో టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఆర్సీబీ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. కాగా భువీ ఆర్సీబీకి వెళ్లిపోవడంతో SRH ప్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ‘మిస్ యువర్ గేమ్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాగా 2013 నుంచి భువనేశ్వర్ SRHకే ఆడుతున్నారు. భువీ టీమ్ ఇండియా జెర్సీలో కంటే ఆరెంజ్ జెర్సీలోనే అందరికీ గుర్తుకొస్తారు. భువీ గతంలో ఆర్సీబీ తరఫున కూడా ఆడిన విషయం తెలిసిందే.
News November 25, 2024
ముంబై ఇండియన్స్‌లోకి మరో తెలుగు కుర్రాడు
ఐపీఎల్ మెగా వేలంలో తెలుగు కుర్రాడు కాకినాడకు చెందిన పెన్మత్స వెంకట సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కే ఆయనను సొంతం చేసుకుంది. ఇప్పటికే ముంబై జట్టులో హైదరాబాదీ తిలక్ వర్మ ఉన్న సంగతి తెలిసిందే. కాగా వైజాగ్‌కు చెందిన అవినాశ్‌ను రూ.30 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే బైలపూడి యశ్వంత్, విజయ్ కుమార్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.
News November 25, 2024
Women Tax Payers: ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ
ఆదాయ పన్ను చెల్లించే మహిళలు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏపీ నుంచి 6.53 లక్షల మంది మహిళలు పన్ను చెల్లించారు. అదే తెలంగాణలో 8.55 లక్షల మంది పన్ను చెల్లించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత ఐదేళ్ల గణాంకాలు తీసుకున్నా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే మహిళలు తెలంగాణలో అధికంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.