News January 21, 2025
6.83 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనాలు
AP: తిరుమలలో పది రోజుల పాటు శ్రీవారిని 6,83,304 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హుండీ ద్వారా రూ.34.43కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ అత్యధికంగా 78 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపింది. ఆదివారం అర్ధరాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియగా, సోమవారం తెల్లవారుజాము నుంచి సాధారణ దర్శనాలను టీటీడీ ప్రారంభించింది.
Similar News
News January 21, 2025
నిధులు మంజూరు చేయించండి.. కిషన్ రెడ్డికి భట్టి వినతి!
TG: రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ₹1.63 లక్షల కోట్లు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. కోణార్క్‌లో ‘గనులు, ఖనిజాల శాఖల మంత్రుల’ సమావేశం సందర్భంగా ఆయనను కలిశారు. ORR-RRR రోడ్లకు ₹45,000cr, మెట్రో విస్తరణకు ₹24,269cr, మూసీ పునరుజ్జీవ పనులకు, సీవరేజ్ మాస్టర్ ప్లాన్ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించాలని వినతిపత్రం ఇచ్చారు.
News January 21, 2025
DOGE నుంచి వివేక్ రామస్వామి ఔట్
ట్రంప్ కొత్తగా ఏర్పాటు చేసిన DOGE నుంచి ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. ఈ శాఖ సృష్టికి సాయపడటం తనకు దక్కిన గౌరవమని, మస్క్ టీమ్ దానిని సమర్థంగా నిర్వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒహైయో స్టేట్ గవర్నర్ పదవికి పోటీచేయడంపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఏదేమైనా ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’కు సాయపడతానన్నారు. H1B అంశంలో నల్లవారితో పోలిస్తే తెల్లవారు లేజీ అనడం ఆయనకు పొగపెట్టినట్టు సమాచారం.
News January 21, 2025
యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్య సేవలు
TG: నెట్ వర్క్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయడంతో మంత్రి రాజనర్సింహా ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. గత ఏడాది కాలంలో రూ.1,137కోట్లు చెల్లించామని, మరో 6 నెలల్లో బకాయిలన్నీ క్లియర్ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇతర సమస్యలపైనా కమిటీ ఏర్పాటు చేసి, సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో ఆరోగ్య శ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది.