News September 10, 2024
రూ.6.85 లక్షల కోట్ల అప్పుంది.. కేంద్రం సహకరించాలి: CM రేవంత్
TG: రాష్ట్రం రూ.6.85 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందని సీఎం రేవంత్ అన్నారు. కేంద్రం అదనపు సహాయాన్ని అందించాలని కోరారు. ప్రజాభవన్‌లో జరుగుతున్న 16వ ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని సీఎం అన్నారు.
Similar News
News December 30, 2024
టీమ్ ఇండియాకు కొత్త కోచ్ రావాల్సిందేనా?
గంభీర్ కోచింగ్‌లో IND టెస్టుల్లో ఘోరంగా విఫలమవుతోంది. స్వదేశంలో BANపై 2-0 తేడాతో సిరీస్ గెలిచినా ఆ తర్వాత NZ చేతిలో 3-0 తేడాతో ఓడింది. ప్రస్తుతం BGTలో 2-1 తేడాతో వెనుకబడింది. WTC ఫైనల్‌కు వెళ్లే అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. దీంతో T20, ODIలకు గంభీర్‌ను కొనసాగిస్తూ టెస్టులకు స్పెషలిస్ట్ కోచ్‌ను నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మీరేమంటారు?
News December 30, 2024
ఈ అమ్మాయిలు మామూలోళ్లు కాదు..!
సౌత్ కొరియా BTS pop బ్యాండ్ అంటే కొందరు అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు. MH ధారావికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు BTS బాయ్స్‌ను కలిసేందుకు ఏకంగా కిడ్నాప్ నాటకం ఆడారు. కిడ్నాప్ అయినట్లు ఓ మహిళతో పోలీసులకు ఫేక్ కాల్ చేయించి దొరికేశారు. తాము పుణేకు వెళ్లి డబ్బు సంపాదించి కొరియాకు వెళ్లేందుకు ప్లాన్ చేశామని విచారణలో వెల్లడించారు. ముగ్గురు బాలికలను (11- 13 ఏళ్లు) పోలీసులు వారి ఫ్యామిలీలకు అప్పగించారు.
News December 30, 2024
CRPF డీజీగా వితుల్ కుమార్
CRPF నూతన డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ వితుల్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ అనీశ్ దయాల్ రేపు పదవీ విరమణ చేయనుండగా ఆ వెంటనే వితుల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన 1993 బ్యాచ్ యూపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీగా పనిచేస్తున్నారు.