News January 14, 2025
ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం: మంత్రి

TG: రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ.12వేల కోట్ల వరకూ భారం పడుతుందన్నారు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ లబ్ధిదారులకు ఒకొక్కరికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులను ఈనెల 26 నుంచి జారీ చేయనున్నారు.
Similar News
News November 9, 2025
ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో చూడండి: రేవంత్

TG: BRS పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని CM రేవంత్ మండిపడ్డారు. ‘ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎవరో పెద్దోళ్లు తీసుకుంటారనుకునేది. ఇప్పుడు గల్లీగల్లీకి విస్తరించారు. అందుకే ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో, ఎవరిది పబ్ కల్చరో.. ఎవరిది సామాన్యులతో కలిసిపోయే కల్చరో చూడండి. సినీ కార్మికులతో ఎవరు మాట్లాడుతున్నారో.. సినీ తారలతో ఫామ్‌హౌస్‌లో ఎవరు ఉంటున్నారో గుర్తు చేసుకోవాలి’ అని కోరారు.
News November 9, 2025
రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి షాకింగ్ కలెక్షన్లు

రష్మిక లీడ్ రోల్లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు ఆశించినస్థాయిలో రావట్లేదు. తొలి రోజు తెలుగు, హిందీలో ₹1.30 కోట్లు, రెండో రోజు ₹2.50 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు Sacnilk వెల్లడించింది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరగొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బుక్ మై షోలో D1 34K టికెట్లు అమ్ముడవగా, D2 68Kకు పెరిగినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది.
News November 9, 2025
5 రాష్ట్రాల్లో రూ.95 కోట్ల స్కామ్స్.. 81 మంది అరెస్ట్

TG: సైబర్ నేరగాళ్లపై రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపుతోంది. AP, TN, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఆపరేషన్ చేపట్టి 81 మంది నిందితులను అరెస్ట్ చేసింది. వీరిపై 754 కేసులున్నాయని, రూ.95 కోట్ల విలువైన మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 84 ఫోన్లు, 101 సిమ్‌లు, 89 బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుల ఖాతాల్లోని రూ.కోట్ల నగదును ఫ్రీజ్ చేశామన్నారు.


