News September 20, 2024
పట్టాలపై 6 మీటర్ల ఇనుప స్తంభం.. తప్పిన ప్రమాదం

లోకో పైలట్ అప్రమత్తతతో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఉత్తరాఖండ్లోని రుద్రపూర్ వద్ద పట్టాలపై 6 మీటర్ల ఇనుప స్తంభం ఉన్నట్లు జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ లోకో పైలట్ గుర్తించాడు. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేసి రైలును ఆపేయడంతో ప్రమాదం తప్పింది. పోల్ తీసేసిన తర్వాత రైలు అక్కడి నుంచి ముందుకు కదిలింది. కాగా ఇటీవల పట్టాలపై రాళ్లు, సిమెంట్ దిమ్మెలు, సిలిండర్లు ఉంచిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Similar News
News November 25, 2025
తిరుపతి జిల్లా విభజన ఇలా..!

తిరుపతి జిల్లా స్వరూపం మారనున్నట్లు తెలుస్తోంది. గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోకి కలపనున్నారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు, వడమాలపేట ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాయి. నిండ్ర, విజయపురం, నగరి చిత్తూరు పరిధిలో ఉండగా వాటిని తిరుపతి జిల్లాలోకి చేరుస్తారని సమాచారం. నెల్లూరులోకి గూడూరు వెళ్తే.. వెంకటగిరి, బాలాయపల్లె, డక్కిలి మండలాలను శ్రీకాళహస్తి డివిజన్లో కలపనున్నారు.
News November 25, 2025
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

ఐబొమ్మ రవి కస్టడీలో సహకరించలేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన తరఫు న్యాయవాది శ్రీనాథ్ తెలిపారు. మొత్తం ఆయనపై 5 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఒక్క కేసులో రిమాండ్ విధించారని, మిగతా కేసుల్లో అరెస్టు కోసం సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇవాళ రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనున్నట్లు పేర్కొన్నారు.
News November 25, 2025
తగ్గిన చమురు దిగుమతులు.. డిస్కౌంట్స్ ఇస్తున్న రష్యా కంపెనీలు

అమెరికా ఆంక్షల కారణంగా కొనుగోళ్లు పడిపోవడంతో రష్యా చమురు కంపెనీలు భారీగా రాయితీలు ఇస్తున్నాయి. జనవరికి డెలివరీ అయ్యే ఒక్కో బ్యారెల్ చమురుపై 7 డాలర్ల వరకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రష్యా చమురు సంస్థలు రాస్నెఫ్ట్, ల్యూకోయిల్పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాయి. మరోవైపు, ఆ దేశం నుంచి కొనుగోళ్లు వద్దంటూ ఒత్తిడి చేస్తుండడంతో భారత రిఫైనరీలూ దిగుమతులు తగ్గించిన సంగతి తెలిసిందే.


