News December 29, 2024

6 విమాన ప్ర‌మాదాలు.. 234 మంది మృతి

image

ప్ర‌పంచ ఏవియేష‌న్ రంగానికి డిసెంబర్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల‌లో పలు దేశాల్లో జరిగిన ప్రమాదాల్లో 234 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు. అదివారం ద‌క్షిణ కొరియాలో జ‌రిగిన ఒక్క ఘటనలోనే 177 మంది మృతి చెందారు. అంత‌కుముందు అజర్ బైజాన్ విమానం కజకిస్థాన్‌లో అనుమానాస్ప‌ద రీతిలో ప్ర‌మాదానికి గురైన ఉదంతంలో 38 మంది అసువులు బాశారు. మ‌రో 4 చోట్ల 19 మంది మృతి చెందడం సాంకేతిక సమస్యలపై ఆందోళన కలిగిస్తోంది.

Similar News

News January 1, 2025

తొలి క్యాబినెట్ భేటీ రైతుల శ్రేయస్సుకు అంకితం: ప్రధాని మోదీ

image

రైతులకు మేలు చేస్తూ కేంద్ర క్యాబినెట్ <<15038464>>తీసుకున్న నిర్ణయాలపై<<>> ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పూర్తి కట్టుబడి ఉంది. మన దేశానికి ఆహారం అందించడానికి కష్టపడి పనిచేసే రైతు సోదర, సోదరీమణులను చూసి గర్విస్తున్నాం. 2025లో మొదటి క్యాబినెట్ సమావేశాన్ని అన్నదాతల శ్రేయస్సు కోసం అంకితం చేశాం’ అని ట్వీట్ చేశారు.

News January 1, 2025

7G బృందావన కాలనీ సీక్వెల్‌కు రంగం సిద్ధం

image

సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో రవికృష్ణ, సోనియా నటించిన ‘7G బృందావన కాలనీ’ 2004లో తెలుగు, తమిళంలో రిలీజై కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. 20 ఏళ్ల తర్వాత డైరెక్టర్ సీక్వెల్ ప్రకటించారు. యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తుండగా, ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే హీరోహీరోయిన్లుగా పాత నటులే ఉంటారా? కొత్తవారిని తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం మీలో ఎంతమందికి ఇష్టం? కామెంట్ చేయండి.

News January 1, 2025

DECలో జీఎస్టీ రూ.1.77 లక్షల కోట్లు

image

2024 డిసెంబర్‌లో రూ.1.77 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. నవంబర్‌(రూ.1.82 లక్షల కోట్లు)తో పోలిస్తే వసూళ్లు కాస్త తగ్గాయి. తాజా వసూళ్లలో CGST రూ.32,836 కోట్లు, SGST రూ.40,499 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.91,200 కోట్లు, సెస్ రూ.12,300 కోట్లు ఉంది. దేశీయ లావాదేవీలతో రూ.1.32 లక్షల కోట్లు(వృద్ధి 8.4 శాతం), దిగుమతులపై పన్నులతో రూ.44,268 కోట్లు(వృద్ధి 4 శాతం) వచ్చింది.