News April 11, 2024

ఇజ్రాయెల్‌కు 6 వేల మంది భారత కార్మికులు

image

నిర్మాణ రంగ పనుల కోసం భారత్ నుంచి 6000 మంది భారత కార్మికులు ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. ఏప్రిల్, మే నెలల్లో వీరిని ప్రత్యేక విమానాల్లో అక్కడికి తరలించనున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇజ్రాయెల్‌లో పనిచేసే పాలస్తీనా కార్మికులను ఆ దేశం పంపించింది. వీరి స్థానంలో భారత్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి కార్మికులను రప్పించుకుంటోంది. వీరికి భారీ జీతాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

Similar News

News January 8, 2026

కొడుక్కు ఇచ్చిన మాట.. 75% సంపాదన సమాజానికి!

image

తన కొడుకు అగ్నివేశ్(49) <<18794363>>ఆకస్మిక మరణం<<>> నేపథ్యంలో వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారం తమ సంపాదనలో 75% సమాజానికి ఇస్తానని తెలిపారు. ‘ఆకలితో ఎవరూ నిద్రపోకూడదని, విద్యకు దూరం కాకూడదని, స్త్రీలు తమ కాళ్లపై నిలబడాలని, యువతకు సరైన పని ఉండాలని కలలు కన్నాం. మేం ఆర్జించిన దాంట్లో 75% సొసైటీకి వెనక్కివ్వాలని అగ్నికి ప్రామిస్ చేశా’ అని చెప్పారు.

News January 8, 2026

తిరుమల: 3 రోజులు SSD టోకెన్లు నిలిపివేత

image

AP: తిరుమలలో ఈనెల 25న రథసప్తమి సందర్భంగా 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు SSD టోకెన్ల జారీ నిలిపేయనున్నట్లు TTD తెలిపింది. 25న ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు పేర్కొంది. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఈనెల‌ 24న‌ ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమంది. NIRలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలూ ఆ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు చెప్పింది.

News January 8, 2026

ఇంటికి ఎన్ని కిటికీలు ఉండాలంటే..?

image

ఇంటి వాస్తులో కిటికీలు కీలకమని, వాస్తు శాస్త్రం ప్రకారం కిటికీలు సరి సంఖ్యలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘తూర్పు, ఉత్తర దిశల్లో కిటికీలు ఉండటం వల్ల సానుకూల శక్తి, ఆరోగ్యం చేకూరుతాయి. కిటికీలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పగిలిన అద్దాలు, శబ్దం చేసే తలుపులు నెగటివ్ ఎనర్జీని తెస్తాయి. పగటిపూట కిటికీలు తెరిచి ఉంచితే వెలుతురుతో పాటు ప్రశాంతత లభిస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>