News October 17, 2024

34కే 6 వికెట్లు.. నలుగురు డకౌట్

image

NZతో తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ బ్రేక్ సమయానికి 34 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. భారత్ ఇన్నింగ్సులో నలుగురు ప్లేయర్లు (కోహ్లీ, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా) డకౌట్ అయ్యారు. ప్రస్తుతం పంత్ (15*) క్రీజులో ఉన్నారు. విలియం 3, హెన్రీ 2, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.

Similar News

News December 3, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

⋆ రేపు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఉ.11 గంటలకు YS జగన్‌ ప్రెస్ మీట్‌
⋆ శ్రీశైలంలో ఈ నెల 7 వరకు సాధారణ భక్తులకు స్పర్శ దర్శనం రద్దు.. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం
⋆ వైఎస్ వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని సునీత వేసిన పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన CBI కోర్టు.. ఈ నెల 10న తీర్పు
⋆ ఈ నెల 23న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

News December 3, 2025

ఆ విమానం ఎక్కడ..? మళ్లీ వెతుకులాట!

image

దశాబ్దం కింద కనిపించకుండా పోయిన విమానం కోసం మళ్లీ వెతుకులాట మొదలవనుంది. 2014 MAR 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన MH-370 విమానం అదృశ్యమైంది. ఇది ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా మారింది. ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిందన్న అనుమానంతో 50 విమానాలు, 60 ఓడలతో గాలించినా దొరకలేదు. MARలో సెర్చ్ ఆపరేషన్ ముగించగా, ఈ నెల 30న మళ్లీ గాలింపు మొదలుపెడతామని మలేషియా తాజాగా ప్రకటించింది.

News December 3, 2025

రైతుల ఖాతాల్లో రూ.7,887కోట్లు జమ: ఉత్తమ్

image

వరి సేకరణలో TG అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. 48hrsలో ₹7,887Cr చెల్లించాం. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. సన్న రకాలకు ₹314Cr బోనస్ చెల్లించాం. అటు APలో ఇప్పటివరకు 11.2L టన్నులు సేకరించారు. 1.7లక్షల మందికి రూ.2,830Cr చెల్లించారు. AP కంటే TG స్కేల్ 4 రెట్లు ఎక్కువ’ అని ట్వీట్ చేశారు.