News November 11, 2024

60 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

image

ఖమ్మంలోని తెల్దారుపల్లిలో దాదాపు 60ఏళ్లకు సీపీఎం నాయకత్వాన్ని కోల్పోయింది. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019తర్వాత సీపీఎంపై తిరుగుబాటు ఎగురవేసిన తమ్మినేని కృష్ణయ్య ఆయన భార్యను ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత పరిణామాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కృష్ణయ్య కుమారుడు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో పార్టీ గ్రామకమిటీని ఇటీవల ఎన్నుకున్నారు.

Similar News

News November 18, 2025

రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందంజ

image

పేరెంట్-టీచర్స్ మీటింగ్‌ అమలులో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. జిల్లాలో 1,236 పాఠశాలకు 1,146 పాఠశాలలు నమోదై 92.7శాతంతో ముందంజలో నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆనందకరమైన బాల్యం అందించేలా సూచనలు చేశారు. క్రీడలు, డాన్స్, ప్రసంగం, కథలు చెప్పడం తదితర అంశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.

పాలేరు డ్యామ్ భద్రతపై నిపుణుల బృందం సమీక్ష

image

డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అశోకు మార్ గంజు ఆధ్వర్యంలో నిపుణుల బృందం పాలేరు జలాశయాన్ని పరిశీలించింది. వారు ఆనకట్ట భద్రత కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, శాశ్వత మరమ్మతులపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చైర్మన్ తెలిపారు. ఈ పర్యటనలో ఎస్ఈ సారంగం, ఈఈ రమేష్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.