News November 13, 2024
60 ఏళ్ల వయస్సులో బంగారు పతకాల పంట

కృష్ణా జిల్లా పెడనకు చెందిన భీమేశ్వరరావు(60) జగ్గయ్యపేటలో 10వ తారీఖున జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో 3 బంగారు పథకాలు సాధించారు. దీంతో ఈ వయసులో కూడా అతని ఫిట్నెస్ చూసి జనం ఆశ్చర్యపోయారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే భీమేశ్వరరావు పాల్గొన్న ప్రతి పోటీల్లో పతకం సాధించడం విశేషం. ఇప్పటి వరకు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో 14 పతకాలను గెలిచాడు. ఈ ఘనతకు కారణం కోచ్ సుబ్రహ్మణ్యం అని చెప్పారు.
Similar News
News November 19, 2025
కృష్ణా: 1.33 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం

పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో 1,33,856 మంది రైతులకు 2వ విడత రూ. 88.49 కోట్ల ఆర్థిక సాయం మంజూరైనట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన మెగా చెక్కును మంత్రి రవీంద్ర రైతులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గోపిచంద్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుంచే నాని, తదితరులు పాల్గొన్నారు.
News November 19, 2025
వైఎస్ జగన్ని కలిసిన కొడాలి, పేర్ని, వల్లభనేని

మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, తదితర అంశాలు గురించి జగన్ వారితో చర్చించారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్నారా.? అనేది ఈ భేటీకి ప్రాధాన్యత సతరించుకుంది.
News November 19, 2025
కృష్ణా: నేడే రైతుల ఎకౌంట్లలో రూ.7వేలు జమ

పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7వేలు నగదు నేడు జమకానుంది. జిల్లాలో 1,33,856 మంది రైతుల ఖాతాల్లో రూ.88.49కోట్లను 2వ విడత సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.66.93కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.21.56కోట్లు జమ కానున్నాయి. తొలి విడత సాయాన్ని గత ఆగస్ట్ నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.


