News August 30, 2024
60 టీఎంసీలకు చేరిన శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 60 టీఎంసీలకు చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 8,503 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా ప్రాజెక్ట్ నుంచి వివిధ కాల్వల ద్వారా 4,425 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1085.10 అడుగుల (60.118 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
Similar News
News November 27, 2025
NZB: 34 మందికి రూ.3.35 లక్షల జరిమానా

నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 34 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారికి రూ.3.35 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
News November 27, 2025
NZB: చట్టబద్ధత దత్తతనే శ్రేయస్కరం: రసూల్ బీ

చట్టబద్ధత దత్తత శ్రేయస్కరం అని మహిళా శిశు సంక్షేమ శాఖ NZB జిల్లా సంక్షేమ అధికారిణి ఎస్.కె.రసూల్ బీ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గురువారం పిల్లల దత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని ఆమె సూచించారు. దివ్యాంగుల పిల్లలను దత్తత తీసుకోవడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
News November 27, 2025
మీడియా సెంటర్ను ప్రారంభించిన NZB కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్లోని రూమ్ నం.30లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (MCMC)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఇందులో అదనపు కలెక్టర్ అంకిత్, DPO శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.


