News August 30, 2024

60 టీఎంసీలకు చేరిన శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 60 టీఎంసీలకు చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 8,503 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా ప్రాజెక్ట్ నుంచి వివిధ కాల్వల ద్వారా 4,425 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1085.10 అడుగుల (60.118 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

Similar News

News February 5, 2025

NZB: కొక్కెర వ్యాధి వల్లే కోళ్ల మృత్యువాత

image

కొక్కెర వ్యాధి వైరస్ వ్యాధి వలన జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు నిజామాబాద్ జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపారు. వ్యాధి గ్రహిత కోళ్ల నమూనాలను నిర్ధారణ కోసం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఈ వ్యాధి వలన మనుషులకు ఎలాంటి ప్రాణాపాయం కలగదని పేర్కొన్నారు.

News February 5, 2025

NZB: ముగ్గురికి జైలు శిక్ష

image

నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు హోటల్స్, స్నూకర్ నడిపిన ముగ్గురు వ్యక్తులకు ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ జడ్జీ మంగళవారం తీర్పునిచ్చినట్లు SHO రఘుపతి తెలిపారు. ఈ మేరకు సవేరా హోటల్ యజమాని షేక్ అబ్బు, మిలన్ హోటల్ యజమాని సమీర్‌, బోధన్ బస్టాండ్ వద్ద స్నూకర్ షాపు నడుపుతున్న మమ్మద్ షాకీర్ హుస్సేన్‌కు శిక్ష విధించినట్లు వెల్లడించారు.

News February 5, 2025

NZB: రైలులోంచి పడి వ్యక్తి మృతి

image

రైలులోంచి ప్రమాదవశత్తు జారి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి శివారులో మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న రైల్లోంచి పడి వ్యక్తి మృతి చెందాడన్నారు.  మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

error: Content is protected !!