News November 23, 2024

60% ముస్లిం ఓట్లు.. 11 మంది ముస్లిం అభ్యర్థులు: భారీ విజయంవైపు BJP

image

UPలోని కుండార్కి బైఎలక్షన్లో BJP రికార్డులు బద్దలుకొట్టనుంది. 30 ఏళ్ల తర్వాత విజయం సాధించబోతోంది. 60% ముస్లిములు ఉండే ఈ సీట్లో BJP అభ్యర్థి రామ్‌వీర్ సింగ్ 19/32 రౌండ్లు ముగిసే సరికి 98,537 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ఆయనకు 1,11,470 ఓట్లు రాగా SP అభ్యర్థి మహ్మద్ రిజ్వాన్‌కు 12,933 ఓట్లే వచ్చాయి. ఈ ఎన్నికల్లో 11 మంది ముస్లిం అభ్యర్థులతో తలపడి రామ్‌వీర్ విజయం సాధించబోతుండటం సంచలనంగా మారింది.

Similar News

News January 29, 2026

SC స్కాలర్షిప్‌లకు ఆదాయ పరిమితిని పెంచనున్న కేంద్రం

image

SC విద్యార్థుల స్కాలర్షిప్‌ల మంజూరులో పేరెంట్స్ గరిష్ఠ ఆదాయ పరిమితిని ₹2.5 లక్షల నుంచి ₹4.5 లక్షలకు కేంద్రం పెంచనుంది. దీనిపై నోట్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్సులను బట్టి హాస్టలర్స్‌కు రూ.4,000-13,500, డేస్కాలర్స్‌కు రూ.2,000-7,500 వరకు స్కాలర్షిప్ అందిస్తున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్ సూచనల తర్వాత క్యాబినెట్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీకి నోట్‌ను అందిస్తారు.

News January 29, 2026

మేడారం జాతర సిత్రాలు (Photo Gallery)

image

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. సమ్మక్క గద్దెపైకి రావడంతో భక్తుల కోలాహలం మరింత పెరిగింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వనదేవతలకు బంగారం (బెల్లం) సమర్పిస్తున్నారు. మేడారం జనజాతర, విశేషాలను పైన ఫొటో గ్యాలరీలో చూడండి.

News January 29, 2026

పోలీసు సేవకు సలాం చెప్పాల్సిందే!

image

అందరూ కుటుంబంతో మేడారం జాతరకు వెళ్తే పోలీసులు మాత్రం మన కోసం కుటుంబాన్ని వదిలి పహారా కాస్తున్నారు. నేడు సమ్మక్క తల్లి గద్దెపైకి రానున్న తరుణంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఒక్క చిన్న ప్రమాదం, పొరపాటు కూడా జరగకుండా వారు అత్యంత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో క్రమశిక్షణతో మహాజాతరను శాంతియుతంగా పూర్తి చేసుకుందాం. పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుదాం.