News August 5, 2025

దేశంలో 60% సంపద 1% కుబేరుల చేతుల్లోనే..

image

భారతదేశ సంపదలో 60% కేవలం ఒక శాతం సంపన్నుల దగ్గరే ఉందని అమెరికాకు చెందిన Bernstein రిపోర్ట్ వెల్లడించింది. ఇండియాలో మొత్తం కుటుంబాల సంపద $19.6 ట్రిలియన్లు కాగా అందులో $11.6 ట్రిలియన్లు కుబేరుల వద్దే ఉందని తెలిపింది. ఇందులో $2.7 ట్రిలియన్ల సంపద మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఈక్విటీలు, బ్యాంకుల్లో పెట్టుబడులుగా పెట్టగా, మిగతా $8.9 ట్రిలియన్లు రియల్ ఎస్టేట్, బంగారం, నగదు రూపకంగా ఉంచారని చెప్పింది.

Similar News

News August 5, 2025

పూర్తి నివేదిక వస్తే అసెంబ్లీలో చీల్చి చెండాడుతాం: హరీశ్ రావు

image

TG: కాళేశ్వరంపై పూర్తి నివేదిక బయటపెడితే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామని హరీశ్ రావు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయనే కాళేశ్వరం అక్రమాలు అంటూ తప్పుడు నివేదికలు తీసుకొచ్చారని ఆరోపించారు. నిన్నటి నివేదిక అబద్ధాలు, రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా ఉందని ఫైరయ్యారు. రాష్ట్రంలో రైతులకు ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పాలనను సీఎం రేవంత్ గాలికి వదిలేశారన్నారు.

News August 5, 2025

APP పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

AP: రాష్ట్రంలో 42 ఏపీపీ (అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులకు ఏదైనా డిగ్రీతోపాటు లా సర్టిఫికెట్ ఉండాలి. ఇంటర్ తర్వాత లా పూర్తి చేసినవారు కూడా అర్హులే. క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేళ్లు ప్రాక్టీస్ చేసి ఉండాలి. 42 ఏళ్లలోపువారు అర్హులు. OC, BC అభ్యర్థులు రూ.600, SC, ST అభ్యర్థులు రూ.300 పరీక్ష ఫీజు చెల్లించాలి. SEP 7లోగా <>slprb.ap.gov.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

News August 5, 2025

విడాకుల రూమర్స్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన హన్సిక

image

తన భర్త సోహైల్ కతురియాతో విడాకుల రూమర్ల వేళ హీరోయిన్ హన్సిక తన ఇన్‌స్టా ఖాతాలో పెళ్లి ఫొటోలు తొలగించారు. కానీ సోహైల్‌ను మాత్రం అన్‌ఫాలో చేయలేదు. కాగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, వీటిపై వారు ఇంతవరకు స్పందించలేదు. సోహైల్, హన్సిక 2022లో పెళ్లి చేసుకున్నారు.