News July 5, 2024
APలో రూ.60వేల కోట్లతో BPCL రిఫైనరీ

AP: మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిన్న పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో సీఎం చంద్రబాబు ఈ విషయంపై చర్చించారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 2-3 వేల ఎకరాల భూమి అవసరమని కేంద్రమంత్రి సూచించగా.. మచిలీపట్నంలో అందుబాటులో ఉందని సీఎం, ఎంపీ బాలశౌరి వివరించారు.
Similar News
News November 4, 2025
రేపు గురుపూర్ణిమ.. సెలవు

రేపు (బుధవారం) గురుపూర్ణిమ/గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఉంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవు వర్తించనుంది. అటు ఏపీలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు సెలవు లేదు. ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చారు.
News November 4, 2025
మనం కూడా న్యూక్లియర్ టెస్టులు చేయాల్సిందేనా?

చైనా, పాకిస్థాన్ <<18185605>>న్యూక్లియర్<<>> వెపన్ టెస్టులు చేస్తున్నాయని ట్రంప్ చెప్పడం భారత్కు ఆందోళన కల్గించే విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1998 నుంచి భారత్ అణుపరీక్షలు జరపలేదు. 2025 నాటికి మన దగ్గర 180 వార్హెడ్స్ ఉంటే.. చైనాలో 600, పాకిస్థాన్లో 170 ఉన్నాయి. త్వరలో పాక్ 200, చైనా 1,000కి చేరే అవకాశం ఉంది. దీంతో భారత్ న్యూక్లియర్ టెస్టులు ప్రారంభించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
News November 4, 2025
నెత్తుటి రహదారి.. 200 మందికి పైగా మృతి

TG: నిన్న <<18186227>>ప్రమాదం<<>> జరిగిన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి(NH-163)ని రాకాసి రహదారిగా పేర్కొంటున్నారు. ఈ మార్గంలోని 46 కి.మీ. రహదారిపై ఎక్కడపడితే అక్కడే గుంతలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. 2018 నుంచి చోటు చేసుకున్న ప్రమాదాల్లో 200 మందికి పైగా మరణించగా సుమారు 600 మంది గాయాలపాలయ్యారు. తాజాగా అన్ని అడ్డంకులు తొలిగి రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలగడంతో పనులు ప్రారంభం కానున్నాయి.


