News October 23, 2024
60 ఏళ్ల క్రితం రూ.570.. ఇప్పుడు ₹63లక్షలు

రోలెక్స్ వాచ్ గురించి నేటి యువతకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమందికి డ్రీమ్ వాచ్ ఇది. అయితే, యూఎస్కు చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ సైతం 1960లో ఎంతో ఇష్టంగా రోలెక్స్ GMTని $120(అప్పుడు రూ.570)కి కొన్నారు. తాజాగా దీనిని విక్రయించేందుకు తీసుకెళ్లగా ఇది అత్యంత విలువైనదని తెలుసుకున్నారు. నేటి మార్కెట్ విలువ ప్రకారం ఈ గడియారానికి $75,000 (రూ.63,06,723)వరకు వస్తుందని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు.
Similar News
News January 17, 2026
కోళ్ల పందేలు.. రూ.2వేల కోట్ల వ్యాపారం!

AP: ఈ సంక్రాంతి సీజన్లో కోళ్ల పందేళ్ల రూపంలో సుమారు రూ.2వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పందేల విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి జోరుగా పందేలు సాగాయి. పెద్దఎత్తున తెలంగాణవాసులు కూడా పందేళ్లలో పాల్గొని సందడి చేశారు. అత్యధికంగా ఓ వ్యక్తి రూ.1.53 కోట్లు గెలుచుకున్నారు.
News January 17, 2026
162 పోస్టులకు NABARD నోటిఫికేషన్ విడుదల

<
News January 17, 2026
మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు

TG: రాష్ట్రంలో 121 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీలకు 38, SC 17, ST 5, జనరల్ కి 61 స్థానాలు కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో కల్లూరు, భూత్పూర్, మహబూబాబాద్, కేసముద్రం, ఎల్లంపేట్ ఉన్నాయి. ఎస్సీ జనరల్ కేటగిరీలో స్టేషన్ ఘన్పూర్, జమ్మికుంట, డోర్నకల్, లక్షెట్టిపేట, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, కోహిర్, హుస్నాబాద్ ఉన్నాయి. పూర్తి వివరాలకు పైన ఫొటోలను స్లైడ్ చేయండి.


