News October 23, 2024
60 ఏళ్ల క్రితం రూ.570.. ఇప్పుడు ₹63లక్షలు

రోలెక్స్ వాచ్ గురించి నేటి యువతకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమందికి డ్రీమ్ వాచ్ ఇది. అయితే, యూఎస్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ సైతం 1960లో ఎంతో ఇష్టంగా రోలెక్స్ GMTని $120(అప్పుడు రూ.570)కి కొన్నారు. తాజాగా దీనిని విక్రయించేందుకు తీసుకెళ్లగా ఇది అత్యంత విలువైనదని తెలుసుకున్నారు. నేటి మార్కెట్ విలువ ప్రకారం ఈ గడియారానికి $75,000 (రూ.63,06,723)వరకు వస్తుందని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు.
Similar News
News February 10, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News February 10, 2026
పెట్టుబడి పరంగా నాకు గోల్డ్ కన్నా బిట్‌కాయిన్లే బెస్ట్: కియోసాకి

గోల్డ్, బిట్ కాయిన్ పెట్టుబడులకు మంచివేనని, ఒక్క దానినే సెలక్ట్ చేసుకోవాలంటే బిట్ కాయిన్‌కే తన ప్రయారిటీ అని ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి చెప్పారు. ‘డిమాండ్ పెరిగితే మైన్స్ నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చు. 21మిలియన్ల తర్వాత బిట్ కాయిన్స్ క్రియేట్ చేయలేం. దీర్ఘకాలంలో ధర పెరుగుతుందని నమ్ముతున్నాను. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి నుంచి కాపాడే హార్ట్ అసెట్స్‌కే మద్దతిస్తాను’ అని తెలిపారు.
News February 10, 2026
బిడ్డకు పాలిస్తే క్యాన్సర్ నుంచి రక్షణ

పాలివ్వడం బిడ్డకే కాదు తల్లికీ రక్షేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. పాలివ్వడం వల్ల మహిళల్లో ఎక్కువగా వచ్చే ట్రిపుల్ నెగెటివ్ అనే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత వక్షోజాల్లో ‘సీడీ8+టీ’ అనే వ్యాధినిరోధక కణాలు ఏర్పడతాయి. ఇవి రక్షకభటుల్లా పనిచేస్తూ, వక్షోజాల్లోని క్యాన్సర్ కణాలని ఎప్పటికప్పుడు చంపేస్తూ ఉంటాయని పరిశోధనల్లో తేలింది.


