News October 12, 2024

అక్కడ ప్రమాదంలో 600 మంది భారత సైనికులు!

image

లెబ‌నాన్‌లోని UN శాంతి ప‌రిర‌క్ష‌ణ బ‌ల‌గాల స్థావ‌రాలపై ఇజ్రాయెల్ దాడి చేయ‌డంపై భార‌త్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇరు దేశాల స‌రిహ‌ద్దుల్లోని బ్లూ లైన్ వెంబ‌డి 600 మంది భార‌త సైనికులు UN శాంతిప‌రిక్ష‌ణ మిష‌న్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ స్థావ‌రాల‌ను ఇజ్రాయెల్ క్షిప‌ణులు ఢీకొట్టాయి. అయితే, అదృష్ట‌వ‌శాత్తు ప్రాణాపాయం త‌ప్పింది. UN స్థావ‌రాల ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని భార‌త్‌ సూచించింది.

Similar News

News December 6, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.540 తగ్గి రూ.1,30,150కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.500 పతనమై రూ.1,19,300పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,95,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 6, 2025

వెస్టిండీస్ వీరోచిత పోరాటం..

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ అసాధారణ రీతిలో ఆడుతోంది. రికార్డు స్థాయిలో 531 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వీరోచిత పోరాటం చేస్తోంది. జస్టిన్ గ్రీవ్స్(181*), కీమర్ రోచ్ (53*) కలిసి 7వ వికెట్‌కు ఏకంగా 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. షాయ్ హోప్ 140 పరుగులు చేసి ఔట్ అయ్యారు. చేతిలో మరో 4 వికెట్లు ఉన్నాయి. 17 ఓవర్లలో 98 పరుగులు చేయాల్సి ఉంది. మరి లక్ష్యాన్ని WI అందుకుంటుందా?

News December 6, 2025

నిజమైన భక్తులు ఎవరంటే?

image

ఏదో ఆశించి భగవంతుడిని సేవించేవారు వ్యాపారస్తులు. వారు తమ కోరికల కోసం దేవునికి డబ్బు ఇచ్చి బదులుగా ఏదో ఆశిస్తారు. కానీ ఫలాపేక్ష లేకుండా స్వామిని కొలిచేవారే నిజమైన భక్తులు. మనం అడగకుండానే దేవుడు కరుణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలన్నీ ఆయన భగవతం ద్వారానే ధరించాడు. ఇదే నిస్వార్థ భక్తి. మనం ఏమీ ఆశించకుండా మన శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ, ఆ ఈశ్వరుడిని అందరిలో చూస్తూ సంతోషాన్ని పంచాలి. <<-se>>#Daivam<<>>