News October 9, 2025

BPCL రిఫైనరీ కోసం 6వేల ఎకరాలు

image

AP: NLR(D) రామాయపట్నం వద్ద BPCL సంస్థకు ప్రభుత్వం 6వేల ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేపిటల్ వ్యయంలో 75% (₹96000 కోట్లు) ఆర్థిక ప్రోత్సాహకాల కింద 20 ఏళ్లలో అందించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ భూముల్లో ₹1లక్ష కోట్లతో ఆ సంస్థ గ్రీన్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్సును ఏర్పాటుచేస్తుంది. ఈ FYలో ₹4,843కోట్లు, తర్వాత వరుసగా 5 ఏళ్లలో ₹96,862 కోట్లు BPCL పెట్టుబడిగా వెచ్చించనుంది.

Similar News

News October 9, 2025

సునామీలో మిస్సింగ్.. 14 ఏళ్లుగా వెతుకుతున్న భర్త!

image

ఎంతో ఇష్టమైన భార్యను కోల్పోయి 14 ఏళ్లు అవుతున్నా జపాన్‌కు చెందిన భర్త యసువో టకమాట్సు ఆమె జాడ కోసం సముద్రంలో జల్లెడ పడుతున్నారు. 2011 సునామీలో కొట్టుకుపోయే ముందు భార్య యుకో ‘నాకు ఇంటికి వెళ్లాలని ఉంది’ అని చెప్పారు. ఆ మాట యసువోను 14 ఏళ్లుగా వెంటాడుతోంది. ఆమె మాటలను గౌరవించి స్కూబా డైవింగ్ నేర్చుకొని ఓనగావా సముద్రంలో వెతుకుతున్నారు. తిరిగి రాదని తెలిసినా వెతికే ప్రయత్నాన్ని ఆపట్లేదు.

News October 9, 2025

791 పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల

image

AP: అటవీశాఖలో ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంటు బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. సెప్టెంబర్ 7న ఈ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్‌కు FSOకు 2,346, FBO, ABOలకు 13,845 మంది అర్హత సాధించినట్లు కమిషన్ పేర్కొంది. FSOలో 100, FBO, ABOల్లో 691 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News October 9, 2025

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

image

AP: 31 మంది IASలను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుత స్థానాల నుంచి వేర్వేరు డిపార్టుమెంట్లకు వీరిని మారుస్తూ CS విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
APSPDCL సీఎండీగా శివశంకర్ తోలేటి, APPSC సెక్రటరీగా రవి సుభాష్, వ్యవసాయ డైరెక్టర్‌గా మనజీర్ జిలానీ, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు, పౌరసరఫరాల శాఖ వైస్ ఛైర్మన్‌గా ఎస్.ఢిల్లీరావును బదిలీ చేసింది. పూర్తి జాబితాకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.