News April 25, 2024
6వేల మంది ఉద్యోగులపై టెస్లా వేటు!

అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాలకు చెందిన 6,020 మంది ఉద్యోగులపై టెస్లా వేటు వేయనుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందించిన నోటీసుల్లో సంస్థ ఈ మేరకు పేర్కొంది. US లేబర్ లా ప్రకారం 100కుపైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు లేఆఫ్స్‌కు ప్లాన్ చేస్తే ప్రభుత్వానికి 60రోజుల ముందు చెప్పాలి. డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 10%కుపైగా సిబ్బందిని తొలగించనున్నట్లు ఇటీవల టెస్లా ప్రకటించింది.
Similar News
News March 4, 2026
మండుతున్న ఎండలు.. భారీగా బీర్ల అమ్మకాలు

TG: రాష్ట్రంలో బీర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఎండలు మండుతుండడంతో వీటి అమ్మకాలు సాధారణం కన్నా 40% పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి MAR చివర్లో బీర్లకు డిమాండ్ ఏర్పడుతుంటుంది. కానీ ఈసారి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆరంభంలోనే ఆ పరిస్థితి ఉంది. ఇక HYDలో నెలాఖరు నుంచి బీరు అమ్మకాలు పెరుగుతాయి. ఈ అమ్మకాల ద్వారా వేసవి 3మాసాల్లో ₹7000 CR GOVTకి రానున్నాయి.
News March 4, 2026
ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్‌లో 30 పోస్టులు..

<
News March 4, 2026
సౌతాఫ్రికాతో సెమీస్.. టాస్ గెలిచిన NZ

T20WC: కోల్‌కతాలో జరగనున్న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
సౌతాఫ్రికా: మార్క్రమ్ (C), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, రబాడ, జాన్సెన్, కేశవ్ మహరాజ్, బాష్, లుంగి ఎంగిడి.
న్యూజిలాండ్: సీఫర్ట్, అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, నీషమ్, శాంట్నర్ (C), మెక్‌కొంచి, హెన్రీ, ఫెర్గ్యూసన్.


