News November 14, 2024
ఒక్కో విద్యార్థికి రూ.6,000.. ఉత్తర్వులు జారీ
AP: తమ నివాసానికి దూరంగా ఉన్న GOVT పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ రూ.13.53 కోట్లు విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్రంలోని 22,558 మందికి లబ్ధి చేకూరనుంది. ఒక్కో విద్యార్థికి రూ.6వేల చొప్పున అందించనుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం KM దూరంలో ప్రాథమిక, 3KM లోపల ప్రాథమికోన్నత, 5KM దూరంలో ఉన్నత పాఠశాలలు ఉండాలి. లేదంటే ట్రావెల్ అలవెన్స్ చెల్లించాలి.
Similar News
News November 14, 2024
VIRAL: తాజ్‌మహల్ కనిపించట్లేదు!
ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి కాలుష్యంగా మారడంతో కొన్ని అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కూడా చూడలేకపోతున్నారు. దీనిని కళ్లకు కట్టినట్లు చూపెట్టే ఫొటోలు వైరలవుతున్నాయి. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లిన పర్యాటకులు ‘తాజ్‌మహల్ కనిపించట్లేదు.. ఎక్కడుందో కనిపెట్టాలి’ అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు.
News November 14, 2024
రేపు 2 విశేషాలు.. మార్కెట్లకు సెలవు
భారత స్టాక్‌మార్కెట్లు శుక్రవారం పనిచేయవు. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15న ఈక్విటీ, డెరివేటివ్స్ మార్కెట్లకు సెలవు. కమోడిటీస్ మార్కెట్లు మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేస్తాయి. దీంతో మార్కెట్ వర్గాలకు 3 రోజుల విరామం లభించినట్టైంది. ప్రస్తుతం దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా రెండోవారమూ పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ చెరో 2%, బ్యాంకు నిఫ్టీ 3% తగ్గాయి.
News November 14, 2024
గ్రూప్-4 ఫలితాలు విడుదల
TG: గ్రూప్-4 ఫలితాలు వెల్లడయ్యాయి. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ లిస్టును TGPSC సైట్‌లో పొందుపర్చారు. ఈ బటన్ <