News July 25, 2024

image

https://sticky.way2news.co/sticky_jsps/QuizNew.jsp?id=327&langid=1&token={TOKEN}

Similar News

News January 5, 2026

గంట మోగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు

image

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మాత్రమే గంట కొట్టాలి. తిరిగి వచ్చేటప్పుడు కొట్టకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు గంటను ఎడమ చేతితో పట్టుకుని లయబద్ధంగా మోగించాలి. అనవసరంగా, పదేపదే కొట్టకూడదు. 2,3 సార్లు స్పష్టంగా మోగించడం శ్రేయస్కరం. రాత్రి సమయాల్లో గంటను బిగ్గరగా మోగించకూడదు. ఈ నియమాలను పాటిస్తే దేవతల ఆవాహన జరగడమే కాకుండా, ఆ ప్రతిధ్వని ద్వారా మనసు ఏకాగ్రతను పొంది ఇంట్లో సానుకూల ప్రకంపనలు వ్యాపిస్తాయి.

News January 5, 2026

AERAIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<>AERAI<<>>)లో 9 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ(కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, బిజినెస్ ఆపరేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ స్టడీస్), CA/CMA/CWA,MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.aera.gov.in

News January 5, 2026

నీటి ప్రాజెక్టుల రుణాల కోసం CM చర్చలు

image

TG: ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా ముంబైలోని పెద్ద ఫైనాన్స్ కంపెనీతో CM రేవంత్, మంత్రి ఉత్తమ్ ఆదివారం మొదటి విడత చర్చలు జరిపారు. అయితే ఏ కంపెనీతో చర్చిస్తుందో వెల్లడి కాలేదు. ప్రాణహిత-చేవెళ్ల, ఇతర ప్రధాన ప్రాజెక్టుల కోసం భారీ నిధులు అవసరం. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ తరుణంలో RBIతో చర్చలకు అధికారులు సిద్ధమవుతున్నారు.