News February 19, 2026
608 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (<
Similar News
News February 19, 2026
స్టాక్ మార్కెట్లు క్రాష్.. ₹7.5లక్షల కోట్లు ఆవిరి!

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1236 పాయింట్ల నష్టంతో 82,498కు చేరగా నిఫ్టీ 365 పాయింట్లు కోల్పోయి 25,454కు క్షీణించింది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో ఉన్న అన్నీ షేర్లూ నష్టాలతోనే ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో, FMCG స్టాక్స్‌లో భారీగా ప్రాఫిట్ బుకింగ్ నమోదైంది. ₹7.5లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అమెరికా-ఇరాన్ టెన్షన్స్, చమురు ధరలు కూడా నష్టాలకు కారణమయ్యాయి.
News February 19, 2026
పిల్లలకు మసాజ్ చేస్తున్నారా?

నెలల వయసున్న పిల్లలకి మసాజ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. దీని వల్ల వారికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మసాజ్ వల్ల పిల్లల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గ్రోత్ హార్మోన్‌ను పెంచుతుంది. బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీస్‌కి మసాజ్ ఎంతో ఉపకరిస్తుందని సూచిస్తున్నారు.
News February 19, 2026
క్యాబేజీ విత్తనాలను నాటే విధానం – జాగ్రత్తలు

క్యాబేజీ విత్తనాలు నాటే ముందు నేలను 4-5 సార్లు.. 100 చ.మీ. విస్తీర్ణంలో 25-30 గంపల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. విత్తనాలను సన్నని ఇసుకతో కప్పి అవి మొలిచే వరకు రోజూ నీరు పెట్టాలి. మొక్కలు మొలకెత్తాక ఎండిన ఆకులను తీసేయాలి. నారు కుళ్లు తెగులు సోకకుండా లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్‌తో నేలను తడపాలి. ఆకుతినే పురుగు నుంచి నారు రక్షణకు లీటరు నీటికి మలాథియాన్ 2ml కలిపి పిచికారీ చేయాలి.


