News May 12, 2024

6,100 మందిపై బైండోవర్ కేసులు: మన్యం ఎస్పీ

image

జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. 1150 మంది సిబ్బంది,6 కంపెనీల కేంద్ర బలగాలను, 56 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు,138 మంది సెక్టార్ అధికారులను నియమించామన్నారు. చెప్పారు. 6,100 మందిపై బైండోవర్ నమోదు చేశామన్న ఆయన..అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు జిల్లా విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు.

Similar News

News March 1, 2026

విజయనగరంలో పోలీసుల ర్యాలీ

image

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం కోట జంక్షన్ నుంచి మూడు లాంతర్ల వరకు పోలీసులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, వారి రక్షణకు పోలీసుశాఖ కట్టుబడి ఉందని డీఎస్పీ గోవిందరావు పేర్కొన్నారు. ఆపద సమయంలో సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి’ యాప్‌ను ప్రతీ మహిళ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News March 1, 2026

VZM: ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి

image

ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు కార్మికులు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకి వినతిపత్రం అందించారు. 7300 మంది కార్మికులు ఉన్న థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి, నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టేట్‌ పబ్లిక్ సెక్రెటరీ అశోక్‌ డిమాండ్‌ చేశారు. అర్హత బట్టి రెగ్యులర్ చేయాలని కోరారు.

News March 1, 2026

VZM: ఉదయాన్నే ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రామభద్రపురం మండలం బూసాయవలస(ముచర్ల వలస) గ్రామ సమీపంలో సాయి కృష్ణ ఆగ్రో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇతని వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.