News January 31, 2025
6,100 కానిస్టేబుల్ పోస్టులు.. BIG UPDATE

APలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన PET, PMT పరీక్షలు నిన్నటితో ముగిశాయి. 69K మంది హాజరవగా దాదాపు 39K మంది అర్హత సాధించినట్లు PRB ఛైర్మన్ రవిప్రకాశ్ తెలిపారు. వీరికి MAR చివరి వారం లేదా APR ఫస్ట్ వీక్‌లో తుది రాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోంగార్డుల రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. కాగా ఈ పోస్టులకు 2023 FEBలో 4.90L మంది ప్రాథమిక పరీక్ష రాశారు.
Similar News
News December 3, 2025
మరో మైలురాయికి చేరువలో రోహిత్ శర్మ

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. మరో 41 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులు చేసిన 4వ భారత బ్యాటర్‌గా అవతరించనున్నారు. 503 మ్యాచ్‌లలో 42.46 సగటు, 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో 19,959 పరుగులు చేశారు. సచిన్ 34,357, కోహ్లీ 27,808, ద్రవిడ్ 24,064 రన్స్‌తో మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. కాగా సౌతాఫ్రికా, భారత్ మధ్య నేడు 2వ వన్డే జరగనుంది.
News December 3, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం ప్రత్యేకత

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఇది ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది. దీనిలో తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.
News December 3, 2025
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


