News September 3, 2024
62 వైద్య శిబిరాలు.. 1.52 లక్షల మందికి సేవలు

తూర్పు గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం 62 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేసామన్నారు. 1,52,298 మందికి వైద్య సేవలు అందించామన్నారు. 46,483 గృహాలకు సేవలందించామన్నారు. సురక్షిత ప్రసవం కోసం ఆరుగురిని ఆసుపత్రికి తరలించామన్నారు. 144 మలేరియా పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
Similar News
News August 22, 2025
గుడ్డిగూడెంలో ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి

గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామం సమీపంలో కూలీలతో వెళ్లిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొలం పనులు ముగించుకొని ఆరుగురు కూలీలు ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
News August 22, 2025
కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పడవ ప్రయాణాలు, చేపలు పట్టడం, ఈతకు దిగడం వంటివి పూర్తిగా నిషేధమని జిల్లా యంత్రాంగం తెలిపింది. సహాయం కోసం 1070, 112 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
News August 22, 2025
స్టాక్ పాయింట్లలో 12,97,874 మెట్రిక్ టన్నుల ఇసుక: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 37 స్టాక్ పాయింట్లలో 12,97,874 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. అరికిరేవుల, ధవళేశ్వరం, మునిపల్లి వంటి ప్రధాన స్టాక్ పాయింట్ల వద్ద ఇసుకను నిల్వ ఉంచినట్లు ఆమె వెల్లడించారు. ఇతర జిల్లాలకు సరఫరా చేయడానికి మరిన్ని స్టాక్ పాయింట్లను సిద్ధం చేశామన్నారు.