News May 23, 2024

ఐదో విడతలో 62.2 శాతం పోలింగ్‌

image

ఈ నెల 20న జరిగిన ఐదో విడత ఎన్నికల తుది పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. 62.2 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు తెలిపింది. ఐదో విడతలో 8 రాష్ట్రాలు, యూటీల్లోని 49 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. 61.48 శాతం పురుషులు, 63 శాతం మహిళలు, 21.96 శాతం ట్రాన్స్‌జెండర్లు ఓటు వేశారు.

Similar News

News November 15, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,25,080కు చేరింది. కాగా రెండు రోజుల్లోనే రూ.3,540 తగ్గడం విశేషం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,800 పతనమై రూ.1,14,650 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,100 తగ్గి రూ.1,75,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 15, 2025

ICMRలో 28 పోస్టులు

image

<>ICMR<<>>లో 28 సైంటిస్ట్-B పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,ST,PWBD,మహిళలు, EWSలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.icmr.gov.in/

News November 15, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
* దివంగత కవి అందెశ్రీ కొడుకు దత్తసాయికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం యోచన
* నల్గొండ జిల్లాలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత.. వైరల్ ఫీవర్‌తో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పిల్లలకు ఇంజెక్షన్ చేయడంతో రియాక్షన్
* నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ