News March 21, 2024
2022లో 62 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్: UN

ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏటా భారీగా పెరుగుతుండటంపై UN ఆందోళన వ్యక్తం చేసింది. 2022లో 62 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అయిందని.. ఇది 6వేల ఐఫిల్ టవర్స్‌తో సమానమని పేర్కొంది. ఏటా ఈ-వేస్ట్ 2.6 మిలియన్ టన్నుల చొప్పున పెరుగుతోందని 2030 నాటికి ఆ మొత్తం 82 మిలియన్ టన్నులకు చేరుతుందని హెచ్చరించింది. ఈ వ్యర్థాలు ఎక్కువగా ఈ-సిగరెట్స్, గృహోపకరణాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపింది.
Similar News
News December 4, 2025
నేడు గుంటూరు జిల్లాకు లంకా దినకర్ రాక

20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ గురువారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. 4వ తేది ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరోగ్యం, విద్యా రంగాలకు సంబంధించిన ప్రత్యేక పథకాల అమలు పురోగతి, అమృత్ (AMRUT) అమలు స్థితి, జల్ జీవన్ మిషన్ పురోగతి, PM సూర్యాఘర్, కుసుమ్ పథకాలపై సమీక్షి నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం విజయవాడ బయల్దేరి వెళ్తారన్నారు.
News December 4, 2025
ఈ అలవాట్లతో సంతోషం, ఆరోగ్యం!

చిన్న చిన్న అలవాట్లే మంచి ఆరోగ్యం, సంతోషానికి కారణమవుతాయని న్యూరాలజిస్ట్ సుధీర్ కుమార్ చెబుతున్నారు. ఉదయాన్నే సూర్యకాంతిలో ఉండటం, రోజువారీ నడక, మంచి నిద్ర, శ్రద్ధతో తినడం, మిమ్మల్ని కేర్ చేసే వారితో మాట్లాడటం, 2 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్, దయతో వ్యవహరించాలని తెలిపారు. రాత్రి వేళల్లో స్క్రీన్ చూడటం తగ్గించడం, హైడ్రేటేడ్‌గా ఉండటం, రోజూ కొత్తవి నేర్చుకోవడం అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.
News December 4, 2025
ఇండియాలో పుతిన్‌ను అరెస్టు చేస్తారా?

ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ICC) 2023లో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం ICCలో సభ్యత్వం ఉన్న 125 దేశాలకు పుతిన్‌ను అరెస్టు చేసే అధికారం ఉంది. అందుకే పుతిన్ ఆ దేశాలకు వెళ్లరు. వాటి ఎయిర్‌స్పేస్ కూడా వాడుకోరు. భారత్ ICC సభ్యదేశం కాదు. ఒకవేళ పుతిన్‌ను అప్పగించాలని ICC కోరినా భారత్.. రష్యాతో స్నేహం వల్ల అందుకు తిరస్కరించే అవకాశమే ఎక్కువ.


