News June 5, 2024
NOTAకు 63 లక్షల ఓట్లు!

లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా బిహార్లో 8.97లక్షల ఓట్లు నోటాకు పడ్డాయని తెలిపింది. యూపీలో 6.34లక్షలు, మధ్యప్రదేశ్లో 5.32L, ప.బెంగాల్లో 5.22L, తమిళనాడులో 4.61లక్షలు, గుజరాత్ లో 4.49లక్షలు, మహారాష్ట్రలో 4.12L, ఏపీలో 3.98L, ఒడిశాలో 3.24లక్షల మంది ఓటర్లు నోటాకు వేశారు. 2019 ఎన్నికల్లో 65.22L ఓట్లు పడగా, ఈసారి ఆ సంఖ్య 2L తగ్గింది.
Similar News
News September 11, 2025
ఇంటర్లో ప్రవేశాలు.. రెండు రోజులే ఛాన్స్

TG: ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు ఆన్లైన్ <
News September 11, 2025
నేడు బాపట్ల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యలంకలో తాటి మొక్కలు నాటి ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నగరవనం అటవీ పార్కులో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతో సమావేశమై ఆర్థికసాయం అందజేస్తారు.
News September 11, 2025
వరద బాధితులకు వెంటనే పరిహారం విడుదల చేయాలి: మంత్రి

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ‘పరిహారం అందని వారికి వెంటనే నిధులు విడుదల చేయండి. బాధితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకూడదు. చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు ₹10Cr, ఇతర జిల్లాలకు ₹5Cr విడుదల చేశాం’ అని తెలిపారు.