News October 6, 2025

SBIలో 63 పోస్టులు.. గడువు పొడిగింపు

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 63 మేనేజర్(క్రెడిట్ అనలిస్ట్) పోస్టులకు దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిగ్రీ లేదా MBA/PGDBA/PGDBM/CA/ICWA/CFA, B.E/B.Tech/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://sbi.bank.in/<<>>

Similar News

News October 6, 2025

RECORD: 10 గ్రా. బంగారం రూ.1.30 లక్షలు

image

దేశంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.30 లక్షలు దాటింది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.1,57,400గా ఉంది.

News October 6, 2025

మరణ భయాన్ని పోగొట్టే శివ మహా పురాణం

image

మానవ జీవితంలో మరణ భయాన్ని మించిన భయం మరొకటి లేదు. అటువంటి భయాన్ని సమూలంగా పోగొట్టే దివ్యౌషధం శివ మహాపురాణం. దీనిని కేవలం శ్రవణం చేస్తేనే మహా పుణ్యఫలం సిద్ధిస్తుంది. సమస్త వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాస, మంత్ర, తంత్ర, జప, తప, ధ్యాన, యోగాదుల జ్ఞానానికంతటికీ సారభూతమైంది ఈ పరమ పవిత్రమైన పురాణం. ఈ గ్రంథ పారాయణం శివ తత్వాన్ని బోధించి, మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది. <<-se>>#SIVOHAM<<>>

News October 6, 2025

ఆకాశం నుంచి బంగారు వర్షం.. ఎప్పుడంటే?

image

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1944, ఏప్రిల్ 14న ముంబైలోని విక్టోరియా డాక్‌లో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి బ్రిటన్ నౌక ‘ఫోర్ట్ స్టికిన్’ తునాతునకలైంది. దీంతో అందులోని 3,50,000 కిలోల బంగారు బిస్కెట్లు గాల్లోకి ఎగిరి వర్షంలా కురిశాయి. వందల మీటర్ల దూరంలో ఇవి ఎగిసిపడటంతో ప్రజలు వీటికోసం పరుగులు తీశారు. అయితే ఓడలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలుండటంతో భారీ విస్పోటనం జరిగి 800 మందికి పైగా చనిపోయారు.