News June 4, 2024
63,985 ఓట్లతో బండి సంజయ్ లీడ్

కరీంనగర్‌లో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదో రౌండ్ లెక్కింపు ముగిసేసరికి BJP అభ్యర్థి బండి సంజయ్ 63,985 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐదో రౌండ్ ముగిసే సరికి బీజేపీ 1,42,675, కాంగ్రెస్ 78,690, బీఆర్ఎస్ 66,351 ఓట్లు వచ్చాయి.
Similar News
News December 5, 2025
ఎంఈవోలకు కరీంనగర్ కలెక్టర్ కీలక ఆదేశాలు

కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎంఈవోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి పదవ తరగతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రత్యేక అధికారులు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ క్లాసులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 20 మంది పిల్లల ఉండాలన్నారు.
News December 5, 2025
వలస కూలీల పిల్లలను బడిలో చేర్చాలి: KNR కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో వలస కూలీలు, ఇటుక బట్టీల కార్మికుల పిల్లలను గుర్తించి ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యాధికారులను ఆదేశించారు. పిల్లలకు రవాణా సాయం అందించాలని ఇటుక బట్టీల యజమానులను కోరారు. అలాగే, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, స్పెషల్ క్లాస్‌లు పర్యవేక్షించి నూరు శాతం ఫలితాలు సాధించాలని సూచించారు.
News December 5, 2025
ఎన్నికల భద్రతపై సమీక్షించిన సీపీ

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రతపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 104 రూట్లు, 57 క్లస్టర్లను ఏర్పాటు, 508 మళ్లీ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, భద్రతా ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.


