News March 30, 2025
64 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: జేసీ కార్తీక్

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 64 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. శనివారం 6,893 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జేసీ చెప్పారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు
Similar News
News April 1, 2025
అనంతసాగరం: ఈతకెళ్లి యువకుడి మృతి

ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన అనంతసాగరం మండలంలో మంగళవారం జరిగింది. అనంతసాగరం మండలం మినగల్లు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ బాష (21) సోమశిల ఉత్తర కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News April 1, 2025
కాకాణి నేడు విచారణకు హాజరవుతారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆయనకు నోటీసులు అందజేసేందుకు పోలీసులు పొదలకూరు, హైదరాబాదుకు వెళ్లినా అందుబాటులో లేరు.ఇవాళ ఉ.11గంటలకు నెల్లూరు DSP ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా APR 18కి విచారణ వాయిదా పడింది. దీంతో ఆయన విచారణకు హాజరవుతారా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.
News April 1, 2025
నెల్లూరు: కాకాణి విచారణకు వస్తారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాకాణికి నోటీసులు అందచేసేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.