News October 20, 2025

CDACలో 646 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC)కు చెందిన వివిధ కేంద్రాల్లో 646 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cdac.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

Similar News

News October 20, 2025

కూతుళ్లు అలా చేస్తే కాళ్లు విరగ్గొట్టాలి: ప్రజ్ఞా ఠాకూర్‌

image

భోపాల్(MP) మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘హిందూయేతర పురుషుడి వద్దకు మనమ్మాయి వెళ్తానంటే కాళ్లు విరగ్గొట్టాలి. మన విలువలు పాటించని వారికి క్రమశిక్షణ నేర్పాలి. పిల్లల భవిష్యత్ కోసం కొట్టినా ఫరవాలేదు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడతాం. కానీ పెద్దయ్యాక ఇతర మతస్థుడి ఇంటికి భార్యగా వెళ్తుంది. అలా జరగకుండా చూడాలి’ అని ఓ రిలీజియస్ ఈవెంట్లో సూచించారు.

News October 20, 2025

వంటింటి చిట్కాలు

image

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

News October 20, 2025

‘చందన బ్రదర్స్’ అధినేత కన్నుమూత

image

చందన బ్రదర్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్‌రావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో 1971లో చందన బ్రదర్స్ సంస్థను ఆయన ప్రారంభించారు. దూరదృష్టితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు.