News October 1, 2024
JK చివరి విడత ఎన్నికల్లో 65.48% పోలింగ్

జమ్మూకశ్మీర్ చివరి విడత ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 65.48% పోలింగ్ నమోదైంది. జమ్మూలోని 24, కశ్మీర్‌లోని 16 స్థానాలు కలిపి మొత్తం 40 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా ఉధంపూర్ జిల్లాలో 72.91%, అత్యల్పంగా బారాముల్లాలో 55.73% పోలింగ్ జరిగింది. మొదటి దశలో 61.38%, రెండో దశలో 57.31% పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. అక్టోబర్ 8న కౌంటింగ్ జరగనుంది.
Similar News
News January 31, 2026
శ్రీవారి డాలర్ విక్రయాలు తాత్కాలికంగా నిలిపివేత

AP: తిరుమలలోని శ్రీవారి డాలర్ విక్రయ కేంద్రాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. బంగారం ధరలు రోజూ మారుతుంటే ఇక్కడ మాత్రం మంగళవారం సాయంత్రమే ధర సవరిస్తుండటంతో TTD నష్టపోతోంది. దీంతో విక్రయ పద్ధతుల్లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌కు అనుగుణంగా రోజూ ధరలు మార్చడం, దర్శనం టికెట్ ఉన్న వారికే ఒక డాలర్ చొప్పున అమ్మాలి, రూ.50వేలు దాటితే PAN నంబర్ తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
News January 31, 2026
శని త్రయోదశి పూజ ఎలా చేయాలి?

నవగ్రహ ఆలయంలో శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు పోసి మూటకట్టి దీపారాధన చేయాలి. తమలపాకులో బెల్లం ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే రావి చెట్టుకు 9 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. పూజ అనంతరం నల్లని వస్త్రాలు, పాదరక్షలు లేదా ఆహారాన్ని దానం చేయాలి. శివార్చన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని పండితులు సూచిస్తున్నారు.
News January 31, 2026
భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ₹8,620 తగ్గి ₹1,60,580కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹7,900 తగ్గి ₹1,47,200గా నమోదైంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.


