News May 14, 2024

తెలంగాణలో 65.66శాతం పోలింగ్?

image

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 65.66శాతం నమోదైనట్లు తెలుస్తోంది. అయితే తుది పోలింగ్ శాతంపై రేపు ఈసీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో ఓవరాల్‌గా 81.3శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. దీన్ని సీఈవో అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

Similar News

News December 29, 2024

ICC అవార్డు.. నామినేట్ అయింది వీరే!

image

ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కోసం ఐసీసీ నలుగురిని నామినేట్ చేసింది. అందులో భారత్ నుంచి అర్ష్‌దీప్ సింగ్, ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్, పాకిస్థాన్ నుంచి బాబర్ ఆజమ్, జింబాబ్వే నుంచి సికందర్ రజాకు చోటు దక్కింది. ఈ నలుగురిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వస్తుంది. ఓటు వేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 29, 2024

కొత్త ఆఫర్: రూ.277తో రీఛార్జ్ చేస్తే..

image

న్యూ ఇయర్ సందర్భంగా BSNL కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.277తో రీఛార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 120GB హై-స్పీడ్ డేటా వస్తుంది. రోజుకు గరిష్ఠంగా 2GB వాడుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 60 రోజులు ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 16, 2025 వరకే అందుబాటులో ఉంటుందని BSNL తెలిపింది. అయితే సిగ్నల్ సరిగా రావట్లేదని, నెట్ చాలా స్లో ఉంటోందని కస్టమర్లు BSNLపై ఫిర్యాదులు చేస్తున్నారు.

News December 29, 2024

ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులే: మంత్రి

image

AP: పేర్ని నాని ఏ తప్పూ చేయకపోతే అజ్ఞాతానికి ఎందుకు వెళ్లారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఆయనకు తెలియకుండా 7 వేల రేషన్ బియ్యం బస్తాలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. ప్రాథమిక విచారణ పూర్తి చేశామని, లోతైన దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులేనని, సూత్రధారి, పాత్రధారి అన్నీ ఆయనేనని విమర్శించారు. సానుభూతి కోసం భార్య పేరును వాడుకుంటున్నారని ఫైరయ్యారు.