News April 1, 2026
68 శాతం మహిళలే..!

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1.95 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని DPTO వై.ఎస్.ఎన్ మూర్తి బుధవారం తెలిపారు. తూ.గో జిల్లాలోని 4 డిపోల నుంచి మొత్తం 2.89 కోట్ల మంది ప్రయాణించగా.. అందులో 68 శాతం మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. పథకం అమలులోకి వచ్చి 225 రోజులు పూర్తయిందని, మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.
Similar News
News April 2, 2026
తూ.గో: నేడు ఉదయం 10 గంటలకు..!

2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఆదేశించారు. ఈ సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు బొమ్మూరు కలెక్టరేట్‌లో జరుగుతుందన్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రి నిమ్మల రామా నాయుడు, మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారని తెలిపారు. బడ్జెట్ అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.

దారపు రీల్స్‌తో రామ మందిరం!

పనికిరాని వస్తువులతో అద్భుత కళాఖండాలను సృష్టించవచ్చని వెలుగుబందకు చెందిన ఉపాధ్యాయుడు భాస్కట పవన్ కుమార్ నిరూపించారు. శ్రీరామనవమి సందర్భంగా దారపు రీల్స్, వాడేసిన అట్టలతో ‘అయోధ్య రామ మందిరం’ నమూనాను అందంగా తయారు చేశారు. బుధవారం ఈ నమూనాను చూసిన తోటి ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు. ‘రీయూస్’ నినాదంతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.