News October 18, 2025
68,900 అప్లికేషన్లు.. మరో 30 వేలు వచ్చే ఛాన్స్

TG: మద్యం దుకాణాలకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులకు ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కొన్ని జిల్లాల్లో దరఖాస్తుదారులు బారులు తీరారు. వారందరికీ అధికారులు టోకెన్లు ఇచ్చారు. ఇప్పటివరకు 68,900 అప్లికేషన్ల ద్వారా రూ.2,067 కోట్ల ఆదాయం వచ్చింది. మరో 30 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఆదాయం రూ.3 వేల కోట్లు దాటనుంది. గతంలో 1.03 లక్షల అప్లికేషన్ల ద్వారా రూ.2,600 కోట్లు వచ్చాయి.
Similar News
News October 18, 2025
న్యాయవ్యవస్థలు దిగొస్తాయని నమ్ముతున్నాం: ఆర్.కృష్ణయ్య

TG: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిర్వహించిన బంద్ విజయవంతమైందని బీసీ జేఏసీ ఛైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయమని భావించి మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో న్యాయవ్యవస్థలు దిగివస్తాయని నమ్ముతున్నామని పేర్కొన్నారు. బీసీ కులాల గౌరవం, పేదరిక నిర్మూలన కోసం తాము పోరాటం చేస్తున్నామని అన్నారు.
News October 18, 2025
150 లిక్కర్ షాపులకు ఏపీ మహిళ దరఖాస్తు

TG: మద్యం షాపుల దరఖాస్తులు నేటితో ముగిశాయి. మొత్తం 90వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసింది. ఆమె ఏపీకి సరిహద్దు జిల్లాల్లోని షాపులకు ఎక్కువగా దరఖాస్తులు చేసిందని అధికారులు చెబుతున్నారు. యూపీ, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా చాలా మంది మహిళలు అప్లై చేసుకున్నారు. ఈనెల 23న లైసెన్స్‌ల కోసం డ్రా నిర్వహించనున్నారు.
News October 18, 2025
USలో యాక్సిడెంట్.. తెలంగాణకు చెందిన తల్లి, కూతురు మృతి

TG: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన రమాదేవి(52), తేజస్వి(32) మృతిచెందారు. విఘ్నేష్, రమాదేవి దంపతుల కూతుళ్లు స్రవంతి, తేజస్వి తమ భర్తలు, పిల్లలతో కలిసి USలో ఉంటున్నారు. తేజస్వి ఫ్యామిలీ USలో నూతన గృహ ప్రవేశం చేయగా, కుటుంబ సభ్యులంతా వెళ్లారు. ఆ తర్వాత అందరూ కలిసి స్రవంతి ఇంటికి కారులో వెళ్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. రమాదేవి, తేజస్వి ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.