News October 13, 2025

ఇండియన్ ఆర్మీ DG EMEలో 69 పోస్టులు

image

ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్( DG EME)69 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, స్టెనోగ్రాఫర్, LDC, MTS, దోబీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వెబ్‌సైట్: https://www.indianarmy.nic.in.

Similar News

News October 13, 2025

8 ఏళ్ల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

image

భారత కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం SEPలో 1.54% తగ్గినట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ తెలిపింది. గత 8 ఏళ్లలో(2017 నుంచి) ఇదే అత్యల్పమని, ఆహార ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమంది. కూరగాయలు, పప్పులు, పండ్లు, ఆయిల్, ఎగ్స్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గి వినియోగదారులకు ఉపశమనం కలిగినట్లు పేర్కొంది. కేరళ 9.05% తగ్గుదలతో టాప్‌లో ఉండగా AP 1.36%, TG -0.15%తో 10, 19 స్థానాల్లో నిలిచాయి.

News October 13, 2025

ట్రంప్, నెతన్యాహును ప్రశంసించిన మోదీ

image

హమాస్ నిర్బంధం నుంచి రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్ బందీలు విడుదల కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘బందీలకు లభించిన ఈ స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి నివాళిగా నిలుస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ అసమాన శాంతి ప్రయత్నాలు, ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు దృఢ సంకల్పానికి ఇది నిదర్శనం. ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ చేసిన హృదయపూర్వక కృషిని స్వాగతిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

News October 13, 2025

30 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు: కృష్ణదేవరాయలు

image

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 30 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం అంగీకారం తెలిపిందని FCI కన్సల్టేటివ్ కమిటీ ఛైర్మన్‌ కృష్ణదేవరాయలు తెలిపారు. గత ఏడాది 15.92 లక్షల టన్నులు సేకరించిందని చెప్పారు. 14 లక్షల టన్నుల బియ్యాన్ని 10% బ్రోకెన్‌తో కొనుగోలు చేస్తారని, పంజాబ్‌ తరువాత ఏపీకే ఈ అవకాశం దక్కిందన్నారు. SKLM, VZM, పల్నాడు జిల్లాల్లో రాష్ట్రం స్థలాన్ని చూపిస్తే కొత్తగా గోడౌన్లను నిర్మిస్తామని వివరించారు.