Similar News
News July 8, 2025
బికినీలో స్టార్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బీచ్ వద్ద బికినీలో ఉన్న ఫొటోలను కరీనా ఇన్‌స్టాలో షేర్ చేశారు. షూటింగ్ కోసమా లేదా ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లారా అనేది వెల్లడించలేదు. కాగా 44 ఏళ్ల వయసులో ఆమె ఫిట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
News July 8, 2025
ఈ నెల 13 వరకే ఫిర్యాదులకు అవకాశం

AP: అన్నదాత సుఖీభవ-PM కిసాన్‌కు సంబంధించి అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. జాబితాలో పేరు లేనివారు రైతు సేవా కేంద్రంలో అర్జీలు అందజేయొచ్చని, అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని గ్రీవెన్స్ మాడ్యూల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. అందుకు ఈ నెల 13వరకే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ పథకం కింద ఈ నెలలోనే రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
News July 8, 2025
అవి సేఫ్.. వెయ్యికి పైగా విమానాలున్నాయి: ఎయిరిండియా

అహ్మదాబాద్‌లో కుప్పకూలిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ మోడల్ విమానం సురక్షితమైందేనని ఎయిరిండియా తెలిపింది. పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఆ సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మోడల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ వెయ్యికి పైగా సేవలందిస్తున్నాయన్నారు. అధికారిక దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ మీటింగ్‌లో ఎయిరిండియా CEO విల్సన్, DGCA, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.