News June 22, 2024
జులై 6 నుంచి సీపీగెట్

TG: ఎంఏ, ఎంకాం, MSc, ఎంఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు జులై 6 నుంచి 15 వరకు సీపీగెట్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45 సబ్జెక్టులకు రోజుకు 3 విడతల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్, MSc ఎలక్ట్రానిక్స్‌కు పరీక్షలు ఉండవన్నారు. అభ్యర్థులు జులై 3 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
Similar News
News November 19, 2025
వంటింటి చిట్కాలు

* ఫ్లాస్క్‌ని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడగాలి.
* అల్లం, వెల్లుల్లిని రుబ్బేటప్పుడు కొద్దిగా వేయిస్తే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
* వంకాయ కూర వండేటప్పుడు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు. రుచి కూడా పెరుగుతుంది.
* కారం డబ్బాలో ఇంగువ వేస్తే పురుగులు పట్టవు.
* పుదీనా, కొత్తమీర చట్నీ చేసేటప్పుడు పెరుగు వేస్తే రుచి పెరుగుతుంది.
News November 19, 2025
362 పోస్టులకు నోటిఫికేషన్

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 MTSపోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హత గల అభ్యర్థులు ఈనెల 22 నుంచి DEC 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టైర్ 1, టైర్ 2 రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.mha.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 19, 2025
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


