News May 4, 2024
6న మాచర్లకు సీఎం జగన్
సీఎం జగన్ ఈ నెల 6న మాచర్లలో పర్యటించనున్నట్లు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి శనివారం తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే ‘మేమంతా సిద్ధం’ సభకు సీఎం వస్తున్నారని చెప్పారు. ఈ సభలో కార్యకర్తలు, నాయకులు విచ్చేసి సభను జయప్రదం చేయాలని కోరారు.
Similar News
News January 2, 2025
గుంటూరు: కానిస్టేబుల్ అభ్యర్థుల పరుగు పోటీలలో 166 మంది అర్హత
పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో పరుగు పోటీలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన పోటీలలో 246 మంది అభ్యర్థులు హాజరవగా దేహదారుఢ్య, పరుగు పోటీలలో 166 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. పోటీల నిర్వహణ తీరును జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. ఏఎస్పీలు సుప్రజ, హనుమంతరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
News January 2, 2025
తాడేపల్లి: అధికారంలోకి రాగానే సక్రమం అయిపోయిందా : YCP
సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే కరకట్టపై ఉన్న అక్రమ నివాసం సక్రమం అయిపోయిందా అని YCP తన ‘X’లో పోస్ట్ చేసింది. లింగమనేని రమేష్ నుంచి ఆ ఇంటిని అక్రమ మార్గాల్లో చంద్రబాబు తీసుకున్నారని.. కానీ అద్దె చెల్లిస్తున్నట్లు మొన్నటి వరకు ఆయన కుటుంబం బుకాయించిందని రాసుకొచ్చారు. కరకట్టపై ఆ ఇల్లు అక్రమ నిర్మాణమని గతంలో టీడీపీ నేత దేవినేని ఉమా ప్రకటించారని గుర్తు చేశారు.
News January 2, 2025
నగరంలో హత్య?
నగరం ఆక్స్ ఫర్డ్ స్కూల్ సమీపంలో సుమారు 60 ఏళ్ల వయసుగల పురుషుడు మృతదేహం లభ్యమైంది. సైడు కాలువ మట్టిలో కూరుకుపోవడం వల్ల మృతదేహం పురుగులు పట్టి ఉంది. మృతదేహం ఎవరన్నది గుర్తించాల్సి ఉంది. 4రోజుల క్రితం ఎవరో వ్యక్తిని చంపి ఇక్కడ పాతి పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన దశలో ఉందని, ఇది హత్యా లేక మరేదైనా కోణమా అని విచారణ చేస్తున్నామని ఎస్ఐ భార్గవ్ తెలిపారు.