News May 3, 2024

7న తిరుపతికి పవన్ కళ్యాణ్ రాక

image

ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ఈనెల 7న తిరుపతికి రానున్నారు. అదే రోజున చంద్రగిరి నుంచి వారాహి రోడ్ షో, తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటం, తిరుపతిలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తుండడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలోనే పర్యటన పూర్తి వివరాలు ప్రకటిస్తామని జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు.

Similar News

News September 17, 2025

చిత్తూరు జిల్లా పర్యాటక అధికారిగా నరేంద్ర

image

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ ఏఎం నరేంద్రకు కీలక పదవి లభించింది. ఆయనను పర్యాటక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టూరిజం రంగంపై నరేంద్ర ఇప్పటివరకు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని అనేక శాస్త్రీయ పత్రాలను ప్రచురించారు. విద్యారంగంలో విశేష అనుభవంతో పాటు సామాజిక రంగంలోనూ ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియమించింది.

News September 16, 2025

TTD టోకెన్ల జారీలో మార్పు

image

TTD అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపులో మార్పు చేశారు. ఇప్పటివరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ఉండగా, ఇకపై లక్కీడిప్ పద్ధతిలో ఇవ్వనున్నారు. 3నెలల ముందుగా ఆన్‌లైన్ ద్వారా లక్కీ డిప్‌లో టోకెన్లు విడుదల చేస్తారు. డిసెంబర్ అంగప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రోజూ 750 టోకెన్లు (శుక్రవారం మినహా) ఉంటాయి.

News September 16, 2025

చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాలు సేకరిస్తాం: భాస్కర్

image

దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ.. ఓటు చోరీపై చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాల సేకరిస్తామని చెప్పారు. ప్రతి పార్టీ బీజేపీకి బానిసలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీడీ నెల్లూరు ఇన్‌ఛార్జ్ రమేశ్, నేతలు పాల్గొన్నారు.