News February 4, 2026
7న ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్

ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ తదితర యాప్ ఆధారిత రవాణా కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేశాయి. అగ్రిగేటర్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఛార్జీలను నిర్ణయించడాన్ని నిరసిస్తూ ఈ నెల 7న ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్ చేపడుతున్నట్లు వెల్లడించాయి. కంపెనీల తీరుతో డ్రైవర్లు ఆదాయం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి. ధరలపై నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికులూ ఇబ్బందులు పడుతున్నారన్నాయి.
Similar News
News February 17, 2026
వంగలో కాయకుళ్లు తెగులు – నివారణ

ఈ తెగులు సోకిన వంగ మొక్కల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మాడి రాలిపోతాయి. కాయలు పసుపు రంగుకు మారి కుళ్లిపోతాయి. నివారణకు నారు మడిలో విత్తేముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో 30 నిమిషాలు నానబెట్టాలి. తెగులు ఆశించిన పొలంలో పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపి పైరుపై 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు ఉదయం లేదా సాయంత్రం పిచికారీ చేయాలి.
News February 17, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News February 17, 2026
FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ <<19164014>>మరోసారి<<>> తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయం నుంచి రూ.2240 తగ్గి రూ.1,54,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.2,050 పతనమై రూ.1,41,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


