News July 6, 2025

7న ప్రజావాణి రద్దు: హనుమకొండ కలెక్టర్

image

హనుమకొండ కలెక్టరేట్‌లో ఈ నెల 7వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News July 6, 2025

మరో ఘోరం.. భర్తను చంపిన భార్య

image

TG: NZB(D) బోధన్(మ) మినార్‌పల్లి గ్రామంలో <<16952152>>మరో దారుణం <<>>జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది. భర్త దేశ్యనాయక్(57) మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీనిపై పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, శుక్రవారం కూడా వివాదం తలెత్తింది. దీంతో కత్తితో భర్తపై దాడి చేసి గొంతులో పొడిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 6, 2025

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా!

image

వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. విత్‌ స్కిన్ కేజీ రూ.170 ధర పలుకుతోంది. స్కిన్‌లెస్ కేజీ రూ.200-210 పలుకుతుండగా, లైవ్ కోడి కేజీ రూ.140-150 మధ్య ధర ఉంది. సిటీతో పోలిస్తే పల్లెల్లో ధర రూ.10-20 వ్యత్యాసం ఉంది. నేడు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కొంత కొనుగోళ్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News July 6, 2025

లోక్ అదాలత్‌లో 169 కేసులు పరిష్కారం

image

మదనపల్లెలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 169 కేసులు పరిష్కారమైనట్లు అదాలత్ సిబ్బంది తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సివిల్ క్రిమినల్ కేసులకు సంబంధించిన కక్షదారులను రాజీమార్గంలో కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. క్రిమినల్ 144 కేసులు, సివిల్ 25 కేసులు మొత్తం 169 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. కాగా బాధితులకు పరిహారంగా రూ.77 లక్షలు అందజేశారు.